మీ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఒరిజినలేనా? లేక నకిలీదా? ఇలా చెక్ చేయండి

First Published Aug 13, 2024, 9:38 AM IST

మొబైల్‌తో పాటు వచ్చే ఛార్జర్ ఒక్కోసారి మనం ఎక్కడో పెట్టి  మర్చిపోతుంటాం. కొన్నిసార్లు ఇంట్లో అందరూ వాడే ఛార్జర్‌ని ఉపయోగిస్తారు. ఇక, మొబైల్ ఛార్జర్ పోతే కొత్తది కొనడం తప్పనిసరి.

స్మార్ట్ ఫోన్‌తో పాటు వచ్చే చార్జర్ అనేక సందర్భాల్లో పాడైపోతుంది. కొన్నిసార్లు సరిగ్గా ఛార్జ్ కూడా కాదు. లేదా పొరపాటున పోగొట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి సమయంలో షాప్‌లలో కొత్త ఛార్జర్ కొంటూ ఉంటాం. అయితే, ఛార్జర్‌ ఒరిజినలా..? కాదా..? ఎలా తెలుసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. 

కొన్నిసార్లు కంపెనీ ఒరిజినల్ ఛార్జర్‌ ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి చాలా మంది తక్కువ ధర ఉన్న ట్రావెలింగ్ ఛార్జర్‌ను కొంటుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. అయితే మార్కెట్లో డూప్లికేట్ ఛార్జర్ల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మీరు వాడుతున్న ఛార్జర్ అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. ఛార్జర్ వెనుక భాగంలో డబుల్ స్క్వేర్ సింబల్ ఉంటే, మొబైల్ ఛార్జర్ లోపల ఉపయోగించే వైరింగ్ డబుల్ ఇన్సులేట్ చేయబడిందని అర్థం. ఈ ఛార్జర్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ఈ ఛార్జర్‌ని ఉపయోగించడం సురక్షితం. ఛార్జర్‌పై V అక్షరం ఉంటే, ఆ ఛార్జర్ కెపాసిటీ సూచిస్తుంది. దీని అర్థం ఛార్జర్ ఐదు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ నంబర్  ఛార్జర్ల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
 

Latest Videos


ఛార్జర్‌పై ఇంటి గుర్తు కనిపిస్తే, ఛార్జర్ పర్సనల్  అవసరాలకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఛార్జర్‌ని హై ఓల్టేజీ ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుంది.

మీరు ఛార్జర్లపై రాసిన 8 లాంటి గుర్తును గమనించవచ్చు. ఈ ఛార్జర్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని దీని అర్థం. మీ ఛార్జర్ సరైన పర్ఫార్మెన్స్  కోసం రూపొందించిందని అర్థం చేసుకోండి. ఇది క్వాలిటీ ఛార్జర్.

కొన్ని ఛార్జర్లు క్రాస్ డస్ట్ బిన్ గుర్తులతో  కూడా ఉంటాయి. అంటే ఈ ఛార్జర్ పాడైతే డస్ట్ బిన్ లో వేయకూడదు. ఎందుకంటే ఇది రీసైకిల్ చేసే ఛార్జర్.

నకిలీ ఛార్జర్‌లు అసలు ఛార్జర్ కంటే కొంచెం భిన్నమైన డిజైన్‌తో ఉంటాయి. కాబట్టి, మీరు ఛార్జర్‌ను కొనేటప్పుడు ఫోన్ ఒరిజినల్ ఛార్జర్ డిజైన్ లాగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. డిజైన్‌లో ఏదైనా తేడా కనిపిస్తే అది నకిలీ ఛార్జర్ కావచ్చు. 

మీరు Samsung, OnePlus లాంటి ఒరిజినల్ ఛార్జర్‌లను కొనే ముందు జాగ్రత్తగా పరిశీలిస్తే హోల్డర్ డిజైన్, గుర్తుల స్థలం, ఫాంట్ సైజ్  మొదలైనవాటిని తప్పకుండా చెక్  చేయండి.

తక్కువ ధరకే డూప్లికేట్ ఛార్జర్ కొని కొద్ది రోజుల్లోనే డస్ట్ బిన్ లో పడేయడం కంటే.. కాస్త ఖర్చు అయినా ఒరిజినల్ ఛార్జర్ కొనడం మేలు. కాబట్టి ఛార్జర్ కొనే విషయంలో జాగ్రత్తగా ఉండండి.

click me!