Gpay, ఫోన్ పే కస్టమర్లకి అలెర్ట్.. వచ్చేస్తోంది కొత్త పేమెంట్ సిస్టం.. దీనిని గమనించారా..?

First Published | Aug 9, 2024, 4:28 PM IST

ఆన్‌లైన్ పేమెంట్స్ సురక్షితంగా చేసే లక్ష్యంతో UPI పిన్ పాస్‌వర్డ్‌కు బదులుగా ఫేస్ స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI ఒక కొత్త సిస్టంతో ముందుకు వచ్చింది. దీని ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ గతంలో కంటే ఇంకా సురక్షితంగా ఉంటాయి. అయితే, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించే వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం, ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడానికి  మీరు 4 లేదా 6 అంకెల  పాస్‌వర్డ్‌(పిన్)ను ఎంటర్ చేయాలి. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. NPCI ప్రస్తుతం కొన్ని స్టార్టప్‌లతో చర్చలు జరుపుతోంది. అందువల్ల UPI ఆధారిత ఆన్‌లైన్ పేమెంట్ PIN పాస్‌వర్డ్‌కు బదులుగా బయోమెట్రిక్ అథెంటికేషన్ అవుతుంది. గత వారం OTP, కార్డ్ ట్రాన్సక్షన్స్ కోసం కొత్త అప్షన్స్ అన్వేషించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులను కోరింది.


UPI Payment Apps

నేటి యుగంలో, కార్డ్ పేమెంట్లకు మొబైల్ OTP అవసరం. అలాగే, UPI పేమెంట్లకు పాస్‌వర్డ్‌లు అవసరం. కానీ కొత్త మార్పుతో యూజర్లు బయోమెట్రిక్ లేదా ఫేస్ స్కాన్‌తో ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయొచ్చు.

కాగా, ఐఫోన్ డివైస్‌ని అన్‌లాక్ చేయాలంటే ఫేస్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉన్న సంగతి తెలిసిందే.
 

పాస్‌వర్డ్‌ల కారణంగా ఎన్నో రకాల ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ పేమెంట్లపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. ఇందుకోసం ఎన్‌పీసీఐ సన్నాహాలు కూడా ప్రారంభించింది.

Latest Videos

click me!