వాట్సాప్ ఇకపై ఈ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయదు.. లిస్ట్ ఇదిగో.. మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి

First Published | Aug 9, 2024, 4:19 PM IST

ఇకపై ఈ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోనున్నట్లు సమాచారం. మొత్తం 35 మోడల్ మొబైల్స్‌ పై  ఈ నిర్ణయం తీసుకున్నారు. డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

WhatsAppను ఎప్పటిలాగే ఉపయోగించడానికి మీరు ఈ మొబైల్ ఫోన్‌ని మార్చాలి లేదా మొబైల్‌ని అప్‌గ్రేడ్ చేయాలి. ఎందుకంటే.. ఈ డివైజ్‌లలో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఈ మొబైల్‌లలో Android, Apple iOS డివైజెస్ రెండూ ఉన్నాయి. ఈ లిస్టులోకి Samsung, Apple, Huawei సహా వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి.
 

వీటి లిస్ట్ ఇక్కడ చూడవచ్చు. iPhone 5, iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE, Samsung Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3, Galaxy S3 Mini, Galaxy S4 Active, Galaxy S4 Mini, Galaxy S4, Moto G, Moto X, Sony Xperia Z1, Xperia E3, LG Optimus 4X HD, Optimus G, Optimus G Pro, Optimus L7, Lenovo 46600, Lenovo A858T, Lenovo P70, Lenovo S890, Huawei Ascend P6, Hua C19 Huawei Y625.
 


వీటికి ఇక సెక్యూరిటీ అప్ డేట్స్ రావడం ఆగిపోయింది. మెటా కంపెనీ ఆండ్రాయిడ్ 5.0 లేదా ఆ పై, iOS 12 లేదా ఆ పై  OSలో మాత్రమే WhatsApp సపోర్ట్ అందిస్తుంది. అంటే WhatsAppని ఉపయోగించడానికి మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడం ఇప్పుడు తప్పనిసరి.
 

మీరు అప్ డేట్ చేయకపోతే, మీకు WhatsApp సపోర్ట్ లభించదు. చాట్ బ్యాకప్ ముఖ్యమైన చాట్స్ సురక్షితంగా ఉంచుతుంది. ఇందుకు ముందుగా వాట్సాప్ యాప్‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
 

ఇక్కడ మీరు చాట్ బ్యాకప్‌ను చూస్తారు. దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు చాట్ సులభంగా బ్యాకప్ అవుతుంది. ఇది చాలా ఈజీ  పద్ధతి.  మీరు దీన్ని అనుసరిస్తే అన్ని WhatsApp బ్యాకప్‌లు క్రియేట్ అవుతాయి.

Latest Videos

click me!