సెల్ ఫోన్ కొనేటప్పుడు అందరూ నచ్చిన కలర్, డిజైన్ అన్నీ చూసుకొనే కొనుక్కుంటారు. కాని వెంటనే అవన్నీ కవర్ చేసేలా, అసలు ఏ కంపెనీ ఫోన్ కొన్నారో కూడా తెలియని ఫోన్ కేస్(ఫోన్ కవర్) లు కొని వేసేస్తారు. ఎందుకంటే.. ఫోన్ రక్షణ కోసం అంటారు. వాస్తవానికి సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడే ఆయా కంపెనీలు స్ట్రాంగ్ గా ఉండాలని, మంచి బిల్డ్ క్వాలిటీతో తయారు చేస్తాయి.
నిజానికి ఫోన్ ను ఫోన్ లా వాడితే అసలు స్క్రీన్ గార్డ్, పౌంచ్ లు అవసరమే ఉండదు. కాని మన ఉరకల పరుగుల జీవితంలో సెల్ ఫోన్ ను చాలా హార్డ్ గా ఉపయోగించడం వల్ల అది తరచూ డామేజ్ అవుతుంది. అందుకే ఎందుకైనా మంచిదని ఓ మంచి ఫోన్ కవర్ వేసేస్తారు. కాని కొన్ని రకాల ఫోన్ ఫోన్ కవర్ల వల్ల సెల్ ఫోన్ ఇంటర్నల్ గా దెబ్బతినే అవకాశం ఉంటుంది.