మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటూ ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL తాజాగా కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో టెలికం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు రకరకాల ప్లాన్స్ ను అందిస్తూ యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడీ రేసులో BSNL కూడా వచ్చి చేరింది. ఇతర సంస్థలు ధరల్ని పెంచిన నేపథ్యంలో యూజర్లు ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కంపెనీ 4జీ సేవలను సైతం దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది.
24
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్యూజర్లను పెంచుకునే నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రూ. 1198తో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.? ఎన్ని రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. నెలకు 300 నిమిషాల కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. వీటితో పాటు నెలకు 3 జీబీ డేటా, 30 ఉచిత ఎస్ ఎమ్ ఎస్ లు పొందొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే రోజుకు రూ. 3.28 మాత్రమే అవుతుంది.
34
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్
బీఎస్ఎన్ఎల్ 425 రోజుల ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న మరో బెస్ట్ ప్లాన్ రూ. 2399. దీంతో రీఛార్జ్ చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ముందు 395 రోజుల వ్యాలిడిటీ ఉండగా తాజాగా వ్యాలిడిటీని పెంచారు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 ఉచిత SMSలు పొందొచ్చు. మొత్తం 850 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది.
44
4G ఇంటర్నెట్ టవర్లు
బీఎస్ఎన్ఎల్ దేశంలో 4జీ సేవలను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగానే 4జీ నెట్ వర్క్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు దాదాపు లక్ష కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇదలా ఉంటే 4జీ సేవలను ప్రారంభించే నేపథ్యంలో జనవరి 15 నుంచి బీఎస్ఎన్ఎల్ 3G సేవల్ని దశలవారీగా నిలిపివేస్తోంది. 3G సేవలు ఆగిపోవడం వల్ల లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నాటికి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G సేవల్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.