రిసార్ట్ పేరుతో..
ఇటీవల సంక్రాంతి సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. సెలవుల్లో టూరిజం ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారిని టార్గెట్ చేసుకున్న కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్స్‌ను రూపొందించారు. ఏపీలోని సూర్యలంక బీచ్ రీసార్ట్ పేరుతో గూగుల్‌లో సెర్చ్ చేయగా వచ్చిన వెబ్‌సైట్‌లో రూమ్స్ బుకింగ్ చేసుకున్నారు. బీచ్‌కు వెళ్లి రిసార్ట్‌లో రూమ్ బుకింగ్ గురించి అడగ్గా అదంతా ఫేక్ అని తెలిసిపోయింది.
దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి మోసాలు కామన్‌గా మారాయని చాలా మంది కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదని చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో పోలీసుల దృష్టికి ఇలాంటి సంఘటనలు వచ్చినట్లు తెలిపారు. గూగుల్ సెర్చ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బులు చెల్లించేవి ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అంటున్నారు.