WhatsApp : ఇక వాట్సాప్ ఫ్రీ కాదు.. నెలకు రూ.79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

Published : Jun 29, 2026, 01:12 PM IST

WhatsApp Plus Subscription: భారత్‌లో వాట్సాప్ ప్లస్ పేరిట పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసింది. నెలకు రూ.79 చెల్లించాలి. మరి సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటి? ఇక వాట్సాప్ ఫ్రీ కాదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇక వాట్సాప్ ఫ్రీ కాదా? జేబుకు చిల్లు పడనుందా? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి?

స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాట్సాప్ ఒక భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేకపోతే గడవదు. అయితే ఇప్పటివరకు ఫ్రీగా వాడుకున్న ఈ యాప్‌కు ఇకపై డబ్బులు కట్టాల్సిన రోజులు వచ్చేశాయి. అవును, వాట్సాప్ హిస్టరీలోనే మొదటిసారిగా ఒక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఇండియాలో లాంచ్ చేశారు.

దీని పేరు వాట్సాప్ ప్లస్ (WhatsApp Plus). ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఇద్దరికీ ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. దీని కోసం యూజర్లు నెలకు రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి మొదటి నెల ట్రయల్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

25
సాధారణ యూజర్ల పరిస్థితి ఏంటి? ఫ్రీనా కాదా?

నెలకు రూ.79 కట్టాలి అనగానే సామాన్య యూజర్లు కంగారు పడుతున్నారు. అయితే ఇక్కడో గుడ్‌న్యూస్ ఉంది. ఈ ప్లాన్ రావడం వల్ల రెగ్యులర్ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాట్సాప్ పూర్తిగా పెయిడ్ యాప్‌గా మారడం లేదు.

మెసేజింగ్‌, వాయిస్ అండ్ వీడియో కాలింగ్, స్టేటస్ అప్‌డేట్స్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లాంటి మెయిన్ ఫీచర్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. వాటి కోసం మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

35
రూ.79 ఇస్తే వాట్సాప్ ప్లస్‌లో ఏం ఫీచర్లు వస్తాయి?

అసలు రూ.79 పెడితే వాట్సాప్ ప్లస్‌లో ఏం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది యాప్ పనితీరును మార్చేసే ప్లాన్ కాదు, కేవలం లుక్ అండ్ ఫీల్‌ను మార్చుకునే కస్టమైజేషన్ ప్యాక్ మాత్రమే. ఇందులో భాగంగా యూజర్లకు 18 కొత్త కలర్ థీమ్స్ లభిస్తాయి. వీటితో యాప్ స్టైల్‌ను మార్చుకోవచ్చు. అలాగే 14 కొత్త యాప్ ఐకాన్ డిజైన్లు అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా నార్మల్ యూజర్లకు దొరకని కొన్ని ఎక్స్‌క్లూజివ్ రింగ్‌టోన్లు, కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు ఇస్తున్నారు. వీటన్నింటితో పాటు ఒక సూపర్ అప్‌డేట్ ఏంటంటే.. చాట్ లిస్ట్‌లో ఇప్పటివరకు కేవలం 3 చాట్స్‌ మాత్రమే పిన్ చేసుకునే వీలుండేది, కానీ వాట్సాప్ ప్లస్ యూజర్లు ఏకంగా 20 చాట్స్ వరకు ఒకేసారి పిన్ చేసి పెట్టుకోవచ్చు.

45
ఈ సబ్‌స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో తెలుసా?

మీకు కూడా ఈ ఫీచర్లు కావాలనిపిస్తే సింపుల్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఇక్కడ చూడండి..

• ముందుగా మీ ఫోన్ లో WhatsApp యాప్‌ను ఓపెన్ చేసి, ఆ తర్వాత సెట్టింగ్స్‌ వెళ్లండి.

• అక్కడ మీకు 'Subscriptions' అనే కొత్త ఆప్షన్ క‌నిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.

• అందులో 'WhatsApp Plus' ఆప్షన్ కనిపిస్తే దానిపై ట్యాప్ చేయాలి.

• తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి, గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.

• పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది.

అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ ఒకేసారి రావడం లేదు. మీ ఫోన్ సెట్టింగ్స్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కనిపించకపోతే, కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

55
మెటా కంపెనీ అసలు ప్లాన్ ఏంటి?

నార్మల్ యూసేజ్ కోసం చూసేవారికి ఈ ఫీచర్లు అంతగా నచ్చకపోవచ్చు. కేవలం బేసిక్ మెసేజ్ లు చేసుకునే వారికి రూ.79 పెట్టడం వేస్ట్ అనిపించవచ్చు. కానీ, వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా ప్లాన్ వేరేలా ఉంది. వాట్సాప్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియా. ఇక్కడ కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

అందులో కేవలం కొద్ది శాతం మంది ఈ రూ.79 ప్లాన్ తీసుకున్నా, మెటా కంపెనీకి ప్రతి నెలా భారీగా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు చిన్నవిగా అనిపించినా, భవిష్యత్తులో వాట్సాప్‌లో ఒక పెద్ద ప్రీమియం ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేయడానికి ఇదొక మొదటి అడుగు అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లు డబ్బులు కట్టడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో టెస్ట్ చేయడానికి మెటా ఈ ప్లాన్ తీసుకొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories