Instagram Reels vs Posts: రీల్స్ వర్సెస్ పోస్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో దేనికి ఎక్కువ రీచ్, ఎంగేజ్‌మెంట్ వస్తుందంటే?

Published : Jun 29, 2026, 12:32 PM IST

Instagram Reels vs Posts: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, పోస్టుల్లో దేనికి ఎక్కువ రీచ్ వస్తుందో తెలుసా? 2026 ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్ డేటా ప్రకారం ఏది బెస్ట్ అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఇన్‌స్టాగ్రామ్‌: రీల్స్ వర్సెస్ పోస్ట్స్.. ఏది బెస్ట్?

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు అందరి మైండ్‌లో 2026లో ఒకటే ప్రశ్న తిరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయాలా? లేక మామూలు పోస్టులు పెట్టాలా? దేనికి ఎక్కువ రీచ్, ఎంగేజ్‌మెంట్ వస్తుంది? ఈ ఏడాది వచ్చిన ప్లాట్‌ఫామ్ అప్‌డేట్స్, క్రియేటర్ల రిపోర్ట్స్, ఇండస్ట్రీ స్టడీస్ ప్రకారం చూస్తే.. కొత్త ఆడియన్స్‌కు రీచ్ అవ్వడంలో, డిస్కవరీలో రీల్స్ దుమ్మురేపుతున్నాయి.

అదే సమయంలో ఎంగేజ్‌మెంట్, సేవ్స్, కమ్యూనిటీ బిల్డింగ్ కోసం పోస్టులు, కరౌజల్స్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలన్నా, మనీ ఎర్న్ చేయాలన్నా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో పక్కాగా తెలుసుకోవాలి.

24
రీచ్‌లో రీల్స్ దే పైచేయి!

2026లో రీల్స్ వల్ల ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డిస్కవరీ. ఇన్‌స్టాగ్రామ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫీడ్ పోస్టులతో పోలిస్తే రీల్స్‌ను చాలా డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తుంది. నార్మల్ పోస్టులు కేవలం మీ అకౌంట్‌ను ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్లకే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ రీల్స్ అలా కాదు, మిమ్మల్ని ఫాలో అవ్వని వాళ్లకు కూడా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ విపరీతంగా రికమెండ్ చేస్తుంది.

చిన్న అకౌంట్లలో సింగిల్ ఇమేజ్ పోస్టుల కంటే రీల్స్‌కు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ రీచ్ వస్తున్నట్లు తాజా ఇండస్ట్రీ డేటా చెప్తోంది. కొన్ని స్టడీస్‌లో అయితే నార్మల్ ఫోటోల కంటే రీల్స్ డబుల్ రీచ్ ఇస్తున్నాయని తేలింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్.. వాచ్ టైమ్, షేర్స్, కంప్లీషన్ రేట్స్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అందుకే షార్ట్ అండ్ ఎంగేజింగ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

34
పోస్టులు, కరౌజల్స్ ఇంకా ట్రెండింగే

రీల్స్‌కు ఎక్కువ రీచ్ వస్తున్న మాట నిజమే అయినప్పటికీ, ఫోటో పోస్టులు, కరౌజల్స్ పనైపోయిందని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా కరౌజల్స్ 2026లో సూపర్ డిస్ట్రిబ్యూషన్ అందుకుంటున్నాయి. రీల్స్ కంటే వీటికి ఎక్కువ సేవ్స్ వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ కంటెంట్, ట్యుటోరియల్స్, స్టెప్-బై-స్టెప్ గైడ్స్ లాంటి వాటికి కరౌజల్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యూజర్లు వీటిని చదవడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. అలాగే ఫోటోలు, కరౌజల్స్, వీడియోల్లో ఒరిజినల్ కంటెంట్‌ను ప్రమోట్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ గట్టిగా ట్రై చేస్తోంది. వేరే వాళ్ల కంటెంట్‌ను మళ్లీ రీపోస్ట్ చేసే అకౌంట్ల విజిబిలిటీని బాగా తగ్గించేస్తోంది.

44
క్రియేటర్లు ఇప్పుడు ఏం చేయాలి?

కేవలం ఒకే ఒక్క ఫార్మాట్‌ను నమ్ముకోవడం కంటే మిక్స్‌డ్ కంటెంట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. కొత్త ఆడియన్స్‌ను రీచ్ అవ్వడానికి రీల్స్ ఫాస్టెస్ట్ వే అయితే, మీ అకౌంట్ అథారిటీని పెంచడానికి, సేవ్స్ పెంచుకోవడానికి కరౌజల్స్ యూజ్ అవుతాయి. ఇక అనౌన్స్‌మెంట్లు, ప్రొడక్ట్ ఫోటోలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కోసం నార్మల్ పోస్టులు పక్కాగా పనిచేస్తాయి.

2026లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వర్సెస్ పోస్ట్స్ డిబేట్‌కు ఆన్సర్ సింపుల్. మాగ్జిమమ్ రీచ్, ఆడియన్స్ గ్రోత్ కావాలంటే రీల్స్ విన్నర్ అవుతాయి. కానీ రీల్స్‌తో పాటు స్ట్రాంగ్ కరౌజల్ పోస్టులు కూడా పెట్టే వాళ్లకే లాంగ్ టర్మ్‌లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏదో ఒక ఫార్మాట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఏ ఫార్మాట్ దేనికి బెస్ట్ అనేది తెలుసుకుని వాడటమే అసలైన సక్సెస్ మంత్ర.

Read more Photos on
click me!

Recommended Stories