లేటెస్ట్ హై ఎండ్ ఫీచర్స్ తో ఐక్యూ నుండి రెండు కొత్త 5జి స్మార్ట్ ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే..

First Published Apr 27, 2021, 11:52 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్  ఐక్యూ  7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కింద  ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ లను ఇండియాలో విడుదల చేసింది. వీటిలో ఐక్యూ 7 ఈ ఏడాది మార్చిలో చైనాలో లాంచ్ అయిన ఐక్యూ నియో 5కి రీ-బ్రాండెడ్ వెర్షన్. బిఎమ్‌డబ్ల్యూ ఎం మోటార్‌స్పోర్ట్స్ రేసింగ్ భాగస్వామ్యంతో ఐక్యూ 7 లెజెండ్ ప్రారంభించారు. 

ఐక్యూ 7 అండ్ ఐక్యూ 7 లెజెండ్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్‌లలో ఫైవ్‌హోల్ డిస్ ప్లే లభిస్తుంది. అలాగే 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అధిక రిజల్యూషన్ గల ఆడియో సపోర్ట్ తో డ్యూయల్ స్పీకర్‌ ఇచ్చారు. ఐక్యూ 7 స్మార్ట్ ఫోన్ ఎం‌ఐ 11ఎక్స్ తో, ఐక్యూ 7 లెజెండ్ ఎం‌ఐ 11ఎక్స్ ప్రొ ఇంకా వన్ ప్లస్ 9ఆర్ తో పోటీపడుతుంది.
undefined
ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ధరఐక్యూ 7 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ .31,990. ఈ ధర వద్ద మీకు 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .33,990. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .35,990. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్ అండ్ సాలిడ్ ఐస్ బ్లూ కలర్‌లో లభ్యమవుతుంది .
undefined
ఐక్యూ 7 లెజెండ్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర 39,990 రూపాయలు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .43,990. ఈ ఫోన్ రిజందేరి రంగులో వస్తుంది అలాగే బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్ లోగో ఉంటుంది. ఈ రెండు ఫోన్లను మే 1 నుండి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించనున్నారు.
undefined
ఐక్యూ 7 స్పెసిఫికేషన్లుఐక్యూ 7లో అండ్రాయిడ్ 11 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఇచ్చారు. 6.62 అంగుళాల ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి పూర్తి హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్, డిస్ ప్లే రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్, ఫోన్ డిస్ ప్లేతో ప్రత్యేకమైన చిప్ అందుబాటులో ఉంటుంది, ఇది ఫ్రేమ్ రేట్‌ను మెరుగుపరుస్తుంది అలాగే హెచ్‌డి‌ఆర్ కంటెంట్‌ను చూడడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 650 జీపీయూ, 12 జీబీ వరకు ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది.
undefined
కెమెరా గురించి మాట్లాడితే దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, సోనీ IMX598 సెన్సార్, ఎపర్చరు f1.79, దీనితో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 5జి, 4జి వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌ డిస్ ప్లే పై ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనికి 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీని, 66W ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కూలింగ్ కోసం 6000 చదరపు మిల్లీమీటర్ల గ్రాఫైట్ లేయర్ ఇచ్చారు.
undefined
ఐక్యూ 7 లెజెండ్ స్పెసిఫికేషన్స్ఐక్యూ 7 లెజెండ్ కూడా అండ్రాయిడ్ 11 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఇచ్చారు. ఈ ఫోన్ 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 12 జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 సెన్సార్, ఎపర్చరు f1.79. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ కూడా 13 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ మోడ్ ఉంటుంది.
undefined
సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ కోసం దీనికి 5జి, 4జి వి‌ఓ‌ఎల్‌టి‌ఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. డ్యూయల్ సెల్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఫోన్ కూలింగ్ కోసం 4096 చదరపు మిల్లీమీటర్ల గ్రాఫైట్ లేయర్ ఇచ్చారు.
undefined
click me!