మీ పేరు మీద మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డ్ వాడుతున్నారా.. అయితే ఈ విధంగా తెలుసుకోండి..

First Published | Apr 26, 2021, 2:17 PM IST

మీ పేరుతో ఉన్న ఐ‌డి ప్రూఫ్ తో  వేరేవారు సిమ్ కార్డు వాడుతున్నారని అనుమానిస్తున్నారా ? అసలు మీద  ఎన్ని పనిచేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఆక్టివ్ గా ఉన్నాయో  తెలుసుకోగలిగే మార్గం ఒకటి ఉంది. 

ఈ సదుపాయాన్ని టెలికమ్యూనికేషన్ విభాగం అందించింది. దీని కోసం ఒక పోర్టల్ కూడా ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్ విభాగం tafcop.dgtelecom.gov.in డొమైన్ నుండి ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని మొబైల్ నంబర్ల డేటాబేస్ ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడింది. మీ పేరు మీద ఉన్న ఐ‌డి ప్రూఫ్ తో వేరొకరు మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నారని మీకు అనిపిస్తే ఈ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగించాలంటే...
undefined
మొదట మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్‌లో లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ తెరవండి. దీని తరువాత మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ నంబర్‌కి ఒక ఓ‌టి‌పి వస్తుంది. ఆ ఓ‌టి‌పిని వెబ్ సైట్ లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి.
undefined

Latest Videos


ఓ‌టి‌పిని ధృవీకరించిన తరువాత, మీ పేరు మీద పనిచేస్తున్న అన్ని నంబర్ల పూర్తి లిస్ట్ మీరు పొందుతారు. వాటిలో మీరు వాడని లేదా తెలియని ఏదైనా నంబరు ఉంటే రిపోర్ట్ చేయవచ్చు. ఆ తరువాత మీరు ఫిర్యాదు చేసిన నంబరుపై ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.
undefined
tafcop.dgtelecom.gov.in ప్రస్తుతానికి కొన్ని సర్కిల్‌ల కోసం మాత్రమే ఈ సౌకర్యం విడుదల చేసింది. త్వరలోనే మిగతా అన్ని సర్కిల్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఒక ఐ‌డి ప్రూఫ్ తో గరిష్టంగా తొమ్మిది నంబర్లు పనిచేయగలవు. మీరు ఈ పోర్టల్‌లో మీ పేరుతో మీకు తెలియకుండా ఉన్న పనిచేస్తున్న ఏదైనా నంబరును చూస్తే మీరు ఆ నంబరు గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీని తరువాత, ప్రభుత్వం ఆ నంబరును బ్లాక్ చేస్తుంది.
undefined
click me!