వాట్సాప్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్.. ఆడియో మెసేజ్ ఇప్పుడు మీ చేతుల్లో..

First Published | Apr 26, 2021, 1:36 PM IST


ఫేస్ బుక్ యజమాన్యంలోని  సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అదేంటంటే మీరు మీ వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ కంట్రోల్ చేయవచ్చు.  

అంటే మెసేజెస్ పంపేటప్పుడు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ ని మీరు ఎంతవరకు ఉంచాలనుకుంటున్నారో మీ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్ట్ లో ఉంది.
undefined
వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ ఫీచర్ ప్రస్తుతం 2.21.9.4 వద్ద వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది, కాని అంతకంటే పై బీటా వెర్షన్‌లో అంటే 2.21.9.5 లో మళ్ళీ నిలిపివేయబడింది. ఇలాంటి పరిస్థితిలో ఈ ఫీచర్ పరీక్షిస్తోందని చెప్పవచ్చు.
undefined

Latest Videos


కొత్త అప్ డేట్ తరువాత వాయిస్ మెసేజెస్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి 1x, 1.5x, 2x ఆప్షన్ లభిస్తుంది. WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారం ఇచ్చింది. మెసేజ్ పంపేటప్పుడు స్పీడ్ కంట్రోల్ పై క్లిక్ చేయడం ద్వారా ప్లేబ్యాక్ స్పీడ్ ఐకాన్ కనిపిస్తుంది, స్పీడ్ మాత్రమే పెంచవచ్చు కానీ తగ్గించే సౌకర్యం ఉండదు.
undefined
WABetaInfo ప్రకారం వాట్సాప్ మరొక కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఒక డివైజ్ నుండి చాట్‌లను తొలగించడానికి వీలు కల్పిస్తుంది.
undefined
click me!