ఐఫోన్ 15 ఇండియా కంటే ఇతర దేశాలలో తక్కువ ధరకే ఎందుకు : ఇక్కడా తయారు చేసిన ఫోన్లలో తేడా ఏంటంటే..

First Published | Sep 15, 2023, 2:37 PM IST

ఆపిల్ ఐఫోన్ 15ని దేశంలోనే కంపెనీ తయారు చేసింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారతదేశంలో అతధికంగా ఉన్నాయి.  ఐఫోన్‌ను భారతదేశంలోనే తయారు చేయడం వల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గుతాయని భావించారు. కానీ, అది సాధ్యం కాలేదు. 
 

ఐఫోన్ 15 భారతదేశంలో కంటే అమెరికా అండ్  దుబాయ్‌లో తక్కువ ధరకు లభిస్తున్నాయి. iPhone 15 Pro Max (1 టెరాబైట్) ధర భారతదేశంలో రూ. 1,99,900. అయితే, USలో దీని ధర $1,599 అంటే రూ. 1,32,717గా ఉంది,  దీని ప్రకారం చూస్తే ఇండియాలో   51% ధర ఎక్కువ. అయితే, ఈ మోడల్ ఇంకా భారతదేశంలో ఉత్పత్తి  చేయలేదు. 
 

మరోవైపు, దేశీయంగా ఉత్పత్తి చేయబడిన మోడళ్లకు USతో పోలిస్తే 20% గ్యాప్ ఉంది. అలాగే, దుబాయ్‌లో ఐఫోన్ 15 ధర AED 3,399 అంటే రూ. 76,817, దీనిని  UAEలో తయారు చేయనప్పటికీ భారతదేశంలో ధర కంటే కొంచెం తక్కువ. 


అలాగే, ప్రో వెర్షన్‌లకు కూడా తేడా  ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఐఫోన్ 15 ప్రో  బేస్ వేరియంట్ ధర రూ. 1,34,900.  అమెరికాలో దీని ధర రూ.82,917 ఉంది. ఆశ్చర్యకరంగా దుబాయ్‌లో దీని చాలా తక్కువ ధర రూ. 97,157కి లభిస్తుంది.  iPhone 15 Pro Max ఇండియా ధర  రూ. 1,59,900, USలో దీని ధర  రూ. 99,517, దుబాయ్‌లో దీని ధర రూ. 1,15,237. 
 

Latest Videos


కారణం?
"దిగుమతి సుంకం చెల్లించిన తర్వాత అనేక యూనిట్లు రవాణా చేయబడటానికి సప్లయ్  చైన్ ఒక కారణం. అలాగే, US ఇంకా  దుబాయ్‌తో పోలిస్తే భారతదేశంలో మార్కెట్ సైజ్  చాలా తక్కువగా ఉంది" అని ప్రముఖ Apple డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.

అలాగే, భారతదేశంలో కంపెనీ దృష్టి ప్రారంభ దశలో పాత జనరేషన్ మోడళ్లపై పడింది. ఎందుకంటే వినియోగదారులు కొత్త జనరేషన్ ఫోన్లను నెమ్మదిగా కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభించినప్పుడు, 54% షిప్‌మెంట్‌లు పాత జనరేషన్ ఐఫోన్‌లు ఉన్నాయి.  

ఐఫోన్ 13 సిరీస్‌ను ప్రారంభించినప్పుడు, ఆ సంవత్సరంలో ఫోన్ ఎగుమతులలో 23% మాత్రమే. మిగిలిన 77% పాత జనరేషన్ ఐఫోన్‌లు ఉన్నాయి" అని రామ్ చెప్పారు.

ఇదిలా ఉంటే, భారతదేశంలో అసెంబ్లింగ్ అంటే అతి తక్కువకే ఐఫోన్‌లు అని అనుకోవడం సరికాదని నవకేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 

click me!