ఐఫోన్ 15 ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. ఎలా పని చేస్తుంది, దీని వల్ల ఉపయోగం ఏంటంటే..?

First Published | Sep 13, 2023, 7:44 PM IST

క్యుపెర్టినో దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈసారి కొత్త ఐఫోన్‌లో శాటిలైట్‌తో నడిచే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందుకోసం కంపెనీ అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (AAA)తో డీల్ కుదుర్చుకుంది.

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఫీచర్ అంటే ఏమిటి?
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ అనేది గత సంవత్సరం iPhone 14తో ప్రవేశపెట్టిన శాటిలైట్ ఫీచర్  ఎమర్జెన్సీ SOSకి ఎక్స్టెన్షన్. అంటే కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దీనిని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు ఇంకా శాటిలైట్ సౌకర్యం ద్వారా సహాయం పొందవచ్చు. మీ కారులో ఏదైనా సమస్య ఉంటే, కార్ లాక్ సమస్య, పెట్రోల్ అయిపోవడం లేదా టైర్ ఫ్లాట్ కావడం వంటి మీ అత్యవసర సహాయం కోసం మీరు AAAకి టెక్స్ట్ చేయవచ్చు.

మీకు సెల్యులార్ లేదా Wi-Fi కవరేజ్ లేనప్పుడు ఈ ఫీచర్ ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో, ఈ శాటిలైట్ అప్షన్  తో Apple అత్యవసర టెక్స్ట్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సహాయం పొందవచ్చు. అయితే, ఈ ఫీచర్ కేవలం అమెరికన్ యూజర్లకు మాత్రమే. ఇంకా మొదటి రెండేళ్లు ఈ సౌకర్యం ఉచితం. అయితే రెండేళ్ల తర్వాత ఈ సదుపాయం కోసం యూజర్లు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 
 

Latest Videos


AAA ప్రకారం, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బందుల్లో పడినట్లయితే, మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత శాటిలైట్ ద్వారా AAAకి కనెక్ట్ కావచ్చు. శాటిలైట్ కి ఎలా కనెక్ట్   కావాలో దానిపై వినియోగదారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం లభిస్తుందని, తద్వారా వారు AAA ఏజెంట్‌తో మెసేజ్ ద్వారా కనెక్ట్ అయి ఉండవచ్చని ఇంకా  వారి రిక్వెస్ట్ స్టేటస్  గురించి ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది.
 

ఫీచర్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే ?
మీరు మారుమూల ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా  మీ కారు బ్యాటరీ ఇంకా  టైర్లు పంక్చర్ అయినపుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు శాటిలైట్ కి కనెక్ట్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలతో స్క్రీన్ పాప్ అప్ అవుతుంది, ఆపై అవసరమైన సమాచారాన్ని AAAకి శాటిలైట్ ద్వారా పంపండి, తద్వారా వారు మీ లొకేషన్ కి ఎవరినైనా పంపవచ్చు.
 

apple

అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే, శాటిలైట్ సేవకు కమ్యూనికేషన్ కోసం ఆకాశంలో స్పష్టమైన వ్యూ  అవసరం. అంటే మీరు దట్టమైన అడవిలో లేదా పార్కింగ్ గ్యారేజీలో ఉన్నట్లయితే అది పనిచేయదు.  ఈ సదుపాయం ఆఫ్-రోడ్ వాహనాలకు కానందున మీరు సర్వీస్  పొందడానికి  రోడ్డుకి  సమీపంలో ఉండాలి. 

click me!