ఇస్రోతో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోకి ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ! మీకు తెలుసా అదేంటో ?

First Published | Sep 14, 2023, 1:13 PM IST

ఆపిల్ ఐఫోన్ 15 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లు పర్ఫార్మెన్స్  అండ్ కెమెరాలో గొప్ప మార్పుతో  లాంచ్ అయ్యాయి. ఈ కొత్త ఐఫోన్‌లలోని ముఖ్యమైన కనెక్టివిటీ ఫీచర్‌లో కూడా ఒక పెద్ద మార్పు చేయబడింది. ఐఫోన్ 15 మొబైల్స్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) NavIC టెక్నాలజీని ఉపయోగించారు.
 

NavIC అనేది USలో ఆపరేట్ చేయబడుతున్న GPS టెక్నాలజీ లాగానే ఇండియా అభివృద్ధి చేసిన మరొక నావిగేషన్ టెక్నాలజీ.

NavIC టెక్నాలజీని ISRO అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు క్వాల్‌కామ్ ఇప్పటికే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. Qualcomm ద్వారా తయారు చేయబడిన మొబైల్ ప్రాసెసర్‌లలో నావిగేషన్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేయడానికి NavIC టెక్నాలజీ  ఉపయోగించబడుతుంది.

ఇప్పుడు అదేవిధంగా ఇస్రో ఆపిల్‌తో ఒప్పందం చేసుకుంది. NavIC టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన కొత్త A17 ప్రో ప్రాసెసర్ iPhone 15 Pro అండ్ iPhone 15 Pro Max Pro మోడల్‌లలో చూడవచ్చు.

 Apple iPhoneలు ఇండియా NavIC టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. Apple వెబ్‌సైట్‌లో మీరు iPhone 15 ప్రో మోడల్‌ల వివరాలలో GPS, GLONASS, గెలీలియో, QZSS, BeiDou ఇంకా NavIC వంటి కోడ్ పేర్లను చూసి ఉండవచ్చు.

Latest Videos


NavIC రెండు రకాల నావిగేషన్ సర్వీసెస్  అందిస్తుంది. ఈ టెక్నాలజీ 7 శాటిలైట్స్  ఆధారంగా పనిచేస్తుంది. కొత్త A17 ప్రో చిప్ గురించి మాట్లాడుతూ ఆపిల్ A17 ప్రో ఐఫోన్‌లలో గేమింగ్ ప్రోయులకు 20 శాతం ఎక్కువ GPU పర్ఫార్మెన్స్ ఇస్తుందని పేర్కొంది. కొత్త A17 ప్రోతో  10Gbps వరకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అందించడానికి కొత్త iPhoneలలో USB-C పోర్ట్ కూడా ఉపయోగించబడుతుంది.

click me!