ఐఫోన్ 13 ప్రో 128జిబి వేరియంట్ ధర రూ .1,19,900, 256జిబి వేరియంట్ ధర రూ .1,29,900, 512జిబి వేరియంట్ ధర రూ .1,49,900, 1 టిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,69,900. ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 128 జిబి వేరియంట్ ధర రూ .1,29,900, 256జిబి వేరియంట్ ధర రూ .1,39,900, 512జిబి వేరియంట్ ధర రూ .1,59,900, 1 టిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,79,900. విశేషం ఏంటంటే ఆపిల్ తయారు చేసిన అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇది.
ఆపిల్ అధికారిక స్టోర్ నుండి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీని ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 6,000 క్యాష్‌బ్యాక్, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.