ఆపిల్ ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆ ఫోన్ ఫేస్ మాస్క్‌ పేట్టుకున్న ఆన్ లాక్ చేస్తుంది..

First Published | Aug 30, 2021, 6:24 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. తాజాగా ఐఫోన్ 13 కోసం ఆపిల్ లవర్ వేటింగ్ ముగియనుంది. ఇప్పుడు లీకైన నివేదికల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 14న లాంచ్ కానున్నట్లు పేర్కొంది.

 ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ వంటి స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 14 న జరిగే యాపిల్ ఈవెంట్‌లో ఒకేసారి లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 14న  లాంచ్ చేసిన తర్వాత సెప్టెంబర్ 17 నుండి ప్రీ-బుకింగులు చేసుకోవచ్చు అలాగే సెప్టెంబర్ 24 నుండి సేల్స్  ప్రారంభమవుతాయి.
 

ఐఫోన్ 13 ఫీచర్లు

ప్రతిసారి లాగానే ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ కెమెరాతో ఎన్నో ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది. ఐఫోన్ 13 ప్రో గతంలో కంటే మెరుగైన అల్ట్రా-వైడ్ లెన్స్‌ను పొందుతుందని మాక్ రూమర్స్ నివేదిక పేర్కొంది. ఆటో ఫోకస్ సపోర్ట్ తో లెన్స్‌లోని 5 ఎలిమెంట్‌లు 6కి అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఐఫోన్ 12 సిరీస్‌లో ఫిక్సెడ్ ఫోకల్ లేన్త్ ఇచ్చారు.


ఐఫోన్ 13 సిరీస్ ఆపిల్ ఎ 15 చిప్‌సెట్‌తో అందించనున్నారు, అంటే ఎ14 బయోనిక్ చిప్‌సెట్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. దీనితో హై రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ ఉంటుంది. కొత్త ఐఫోన్‌కి సంబంధించి, ఈ మోడళ్లలో కొత్త ఫేస్ ఐడి హార్డ్‌వేర్ ఇచ్చారు, ఫేస్ మాస్క్ లేదా గాగుల్స్  పెట్టుకున్నగాని  ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు.
 

కొత్త సిరీస్ ఐఫోన్‌లో ఫ్రంట్ కెమెరా ఉన్న ప్రదేశంలో కొద్దిగా మార్పులు చేయవచ్చు. కొత్త ఫేస్ ఐడిని పరీక్షించడానికి ఆపిల్ ఉద్యోగులకు ప్రత్యేక కేసును ఇచ్చినట్లు ఫ్రంట్ పేజ్ టెక్.కామ్ నివేదిక పేర్కొంది. ఫేస్ ఐడితో పాటు ఆపిల్ కొత్త ఇన్-డిస్‌ప్లే టచ్‌ఐడి ఫింగర్ ప్రింట్ స్కానర్‌పై కూడా పనిచేస్తోంది.

Latest Videos

click me!