త్వరలోనే టెలిగ్రామ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్.. ఆ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి..

First Published Apr 29, 2021, 12:22 PM IST

ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్  ప్రైవసీ పాలసీ వివాదం తర్వాత ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్  డౌన్ లోడ్లు భారీగా పెరిగాయి. గత సంవత్సరంలో టెలిగ్రామ్ వినియోగదారుల కోసం ఎన్నో కొత్త ఫీచర్లను జోడించింది.

కరోనా కాలంలో అధిక డౌన్ లోడ్లతో దూసుకెళ్తున్నా టెలిగ్రామ్‌ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తీసురాబోతుంది. అదేంటంటే త్వరలో గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.
undefined
ఈ సమాచారాన్ని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్వయంగా వెల్లడించారు. ఈ గ్రూప్ వీడియో కాలింగ్ మొదట ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. టెలిగ్రామ్‌లో గ్రూప్ వీడియో కాలింగ్ అప్ డేట్ వచ్చే నెలలో విడుదల కానుంది. గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించాలనే ఆలోచన 2020నుంచే ఉందని, కానీ కొన్ని కారణాల తీసుకురాలేక పోయినట్లు చెప్పారు.
undefined
పావెల్ దురోవ్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో రాబోయే ఫీచర్ గ్రూప్ వీడియో కాల్ గురించి సమాచారం ఇచ్చారు. నేటి అవసరానికి అనుగుణంగా వీడియో కాల్స్‌కు స్క్రీన్ షేరింగ్, ఎన్‌క్రిప్షన్, నాయిస్ క్యాన్సలేషన్, డెస్క్‌టాప్ అండ్ టాబ్లెట్ సపోర్ట్, వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్, టెలిగ్రామ్ లెవల్ యుఐ వంటి ఫీచర్లు లభిస్తాయని ఆయన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
undefined
టెలిగ్రామ్ ఇప్పటికే ప్రైవేట్ వీడియో కాల్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ సపోర్ట్ గ్రూప్ వీడియో కాల్స్ కూడా అందించనుంది. కరోనా యుగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల టెలిగ్రామ్ యాప్ వినియోగం భారీగా పెరిగింగి.
undefined
2018 సంవత్సరంలో టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య 200 మిలియన్లు. 2020 ఏప్రిల్‌లో 400 మిలియన్లకు చేరుకుంది. టెలిగ్రామ్ 2021లో వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానం నుండి కూడా ప్రయోజనం పొందింది.
undefined
click me!