Instagram Reels Auto Scroll Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ వల్ల సోషల్ మీడియా, ఫోన్ల కు మరింత బానిసలుగా మారే అవకాశముందనీ, మానసిక ఆరోగ్యానికి ప్రభావం చూపే ప్రమాదముందని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటీ?
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసేవారికి త్వరలో కొత్త అనుభవాన్ని ఎదుర్కొబోతున్నారు. రీల్స్‌ను చూసేందుకు ఇకపై స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ స్క్రోలింగ్ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ తో రీల్స్, ఫీడ్ పోస్టులు ఆటోమేటిక్ గా స్క్రోల్ అవుతాయి. ముఖ్యంగా ఇతర పనులతో పాటు ఇన్‌స్టాగ్రామ్ వాడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఫోన్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
25
ఇక స్క్రోల్ అవసరం లేదు!
ఇన్‌స్టాగ్రామ్ తాజాగా పరిచయం చేసిన ఆటో స్క్రోల్ ఫీచర్‌తో రీల్స్‌ను చేతితో స్క్రోల్ చేయాల్సిన పని ఉండదు. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీరు ఒక రీల్‌ను స్కిప్ చేసిన తర్వాత తదుపరి రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి. మొదటి రీల్ పూర్తయిన వెంటనే, ఆ తర్వాతి రీల్ స్వయంగా స్క్రోల్ అవుతుంది.
35
ఇన్‌స్టాగ్రామ్ ఆటో స్క్రోల్ ఫీచర్ ఎలా ఆన్ చేయాలి?
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే.. ఏదైనా రీల్‌కి వెళ్లండి. రీల్ స్క్రీన్‌లో కింది కుడివైపు మూడు చుక్కలు (⋮) కనిపిస్తాయి. వాటిపై నొక్కండి. అక్కడ ‘Auto Scroll’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేస్తే.. రీల్స్ ఆటోమేటిక్‌గా స్క్రోలింగ్ యాక్టివేట్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ మరిన్ని కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యాప్స్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఆటో స్క్రోల్ ఫీచర్ వస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ మరో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు యూజర్లు 1:1 స్క్వేర్ లేదా 4:5 రెక్టాంగిల్ ఫార్మాట్‌లో మాత్రమే ఫోటోలు షేర్ చేయగలిగారు. కానీ తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ 3:4 వర్టికల్ ఫోటోలకు కూడా సపోర్ట్ అందిస్తోంది.
55
ఇకపై సులువుగా ఫోటోల షేరింగ్
ఇన్‌స్టాగ్రామ్ తన ఫోటో ఫార్మాట్లలో కీలక మార్పు చేసినట్టు సంస్థ హెడ్ ఆడమ్ మోసేరి థ్రెడ్స్ ద్వారా ప్రకటించారు. ఇప్పటి వరకు 1:1 లేదా 4:5 ఫార్మాట్‌లకే పరిమితి ఉన్నా, ఇప్పుడు యూజర్లు 3:4 వర్టికల్ ఫోటోలను కూడా షేర్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో, సింగిల్ ఫోటోలు, మల్టిపుల్ ఇమేజ్ పోస్ట్‌లు రెండింటినీ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో అప్‌లోడ్ చేయవచ్చు. మీరు ఫోటో ఎలా తీసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే అప్ లోడ్ చేయవచ్చు. ఇలా మరింత సులభంగా ఫోటోలను షేర్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ ఫోటోగ్రాఫర్లకు, కంటెంట్ క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. మరో వైపు సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణలు ఆందోళన చెందుతున్నారు.