విశాఖపట్నంలో ఉన్న ఈ 17 వేల టన్నుల ట్రాకింగ్ షిప్ ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత నౌకాదళం బలం గణనీయంగా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం, ప్రపంచంలోని నాలుగు దేశాలలో మాత్రమే ఈ టెక్నాలజీతో కూడిన నావల్ మిస్సైల్ సిస్టమ్ ఉంది.
ఐఎన్‌ఎస్ ధృవ్ చరిత్ర ఏమిటి?
ఐఎన్‌ఎస్ ధృవ్ ని భారతదేశంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. దీని నిర్మాణం ప్రారంభంలో దీనికి VC-11184 అనే పేరు ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 జూన్ 2014న ఈ షిప్ సెంట్రల్ స్టృక్చర్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), జాతీయ భద్రతా సలహాదారు (NSA) పర్యవేక్షణలో చాలా రహస్యంగా ఉంచారు.
ఈ నౌకను నిర్మించిన తరువాత ట్రయల్ గురించి సమాచారం కూడా చాలా రహస్యంగా ఉంచారు. నివేదికల ప్రకారం ఐఎన్ఎస్ ధృవ్ హార్బర్ ట్రయల్స్ జూలై 2018లో ప్రారంభమైంది. 2018 చివరి నాటికి సముద్ర పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండేళ్ల పాటు సమగ్ర విచారణ తర్వాత ఈ నౌకను రహస్యంగా 2020 అక్టోబర్‌లో నేవీకి డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అధికారికంగా 2021 సెప్టెంబర్‌లో నావికాదళంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నౌక మొత్తం నిర్మాణ వ్యయం వెల్లడించలేదు. కానీ 2014 నివేదిక ప్రకారం దీనిని నిర్మించడానికి సుమారు రూ .1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
భారతదేశానికి ట్రాకింగ్ నౌక ఎందుకు అవసరం ?
ప్రస్తుతం భారతదేశ రెండు పొరుగు దేశాలు (చైనా ఇంకా పాకిస్తాన్) అణ్వాయుధాలను(న్యూక్లియర్ వేపన్స్) కలిగి ఉన్నాయి. చైనా చాలా కాలంగా సముద్ర సరిహద్దు ద్వారా భారతదేశంపై నిఘా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. చైనా ప్రస్తుతం నౌకాదళ పర్యవేక్షణలో ముందంజలో ఉంది. ఇంకా భారతదేశం కంటే పెద్ద ట్రాకింగ్ షిప్‌లను కలిగి ఉంది. చైనా సముద్ర ప్రాంతం నుండి హిందూ మహాసముద్రానికి చాలా కాలంగా నిఘా నౌకలను పంపుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం.
క్షిపణి ట్రాకింగ్ కోసం ఐఎన్‌ఎస్ ధృవ్ ఎలా పని చేస్తుంది?
చైనా, పాకిస్తాన్ రెండూ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజి కలిగి ఉన్నాయి. అయితే భూమి, వాయు శ్రేణిలో భారతదేశం ఆధునిక రాడార్ టెక్నాలజిని కలిగి ఉంది. దీనితో యుద్ధ సమయంలో ఈ రెండు దేశాల నుండి వచ్చే క్షిపణి-రాకెట్లను ట్రాక్ చేయవచ్చు ఇంకా నాశనం చేయవచ్చు. దీనితో పాటుగా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా రష్యా నుంచి భారత్ త్వరలో పొందబోతోంది, ఈ రెండు దేశాల సరిహద్దులో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే, భారత భూ సరిహద్దులో ఏదైనా క్షిపణి లేదా విమానం దాడి నుండి రక్షణగా ఉంచుతుంది.
పెద్ద ప్రమాదం ఏమిటంటే భూయుద్ధం మధ్యలో చైనా ఇంకా పాకిస్తాన్ భారతదేశంపై నావికాదళ షిప్స్ నుండి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడానికి సముద్ర మార్గాన్ని ఉపయోగించవచ్చు. బాలిస్టిక్ మిసైల్ హై రేంజ్ కలిగి ఉంటాయి. పెద్ద సముద్ర ప్రాంతాలలో రాడార్ కోసం నిర్దేశించిన స్థలం ఉండదు కాబట్టి, నావికాదళ ట్రాకింగ్ ఇంకా నిఘా నౌకలు ఉపయోగపడతాయి. ఈ ట్రాకింగ్ షిప్‌లు ఆధునిక నిఘా రాడార్‌లతో అమర్చబడి ఉంటాయి, ఇవి నేరుగా యాంటెన్నా ద్వారా శాటిలైట్ ని కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ శాటిలైట్ దూరంలోని క్షిపణిని గుర్తించి షిప్ లోని ఉన్న రాడార్‌కు సమాచారాన్ని పంపుతాయి. ఈ షిప్ బాలిస్టిక్ క్షిపణులను సులభంగా ట్రాక్ చేసి ఇంకా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఈ అవసరాలన్నీ ఐఎన్‌ఎస్ ధృవ్ ద్వారా తీరిపోతుంది.
ఐఎన్ఎస్ ధృవ్ ప్రత్యేకతలు ఏమిటి?
ఐఎన్‌ఎస్ ధృవ్‌ను విక్ శాండ్‌విక్ డిజైన్స్ డిజైన్ చేసింది. దీని పొడవు 175 మీటర్లు అంటే రెండు ఫుట్‌బాల్ మైదానాలకు సమానం, వెడల్పు 22 మీటర్లు. ఈ షిప్ లో ఒకేసారి 300 మంది నావికులు ఉండవచ్చు. ఈ షిప్ స్ప్పిడ్ 21 నాట్స్ (గంటకు 40 కి.మీ) వరకు వెళ్తుంది. నిఘా కోసం ఉపయోగించే ఈ షిప్ లో 9000 kW డీజిల్ ఇంజిన్ కూడా అమర్చారు. అంతే కాకుండా 1200 kW రెండు ఆక్సీలరేటరి జనరేటర్లు కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
ఐఎన్‌ఎస్ ధృవ్ రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఏ టెక్నాలజీపై నిర్మించారు ?
ఐఎన్‌ఎస్ ధ్రువ్ ట్రాకింగ్ అండ్ సర్వైలెన్స్ షిప్ అతిపెద్ద బలం దాని రాడార్ వ్యవస్థ, అదేంటంటే 2,000 కి.మీ దూరం నుండి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ట్రాక్ చేయగలదు. నివేదికల ప్రకారం, X-బ్యాండ్ AESA, S- బ్యాండ్ AESAని ఈ ఓడలో ఇన్‌స్టాల్ చేశారు. వీటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ రీసెర్చ్ (NTRO) అండ్ డిఆర్‌డిఓలో ఇండియన్ నేవీ అభివృద్ధి చేసింది.
ఈ ట్రాకింగ్ షిప్‌లో ఇన్‌స్టాల్ చేసిన రాడార్ 360 డిగ్రీలు నిరంతరం తిప్పగలదు ఇంకా క్షిపణులు, విమానాలను ట్రాక్ చేయగలదు. ఈ రాడార్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక రాడార్ కాదు, చాలా రాడార్‌ల సమూహం. అంటే, ఒక రాడార్ ఒకసారి ఒక విషయాన్ని మాత్రమే ట్రాక్ చేయగలదు కానీ ఐఎన్‌ఎస్ ధ్రువ్‌లో ఇన్‌స్టాల్ చేసిన రాడార్ ఒకేసారి మల్టీ టార్గెట్లను లక్ష్యంగా చేసుకోగలదు. ఈ రాడార్ లాక్ చేయడం ద్వారా ఒకేసారి 10 టార్గెట్‌లను టార్గెట్ చేయగలదు.
బాలిస్టిక్ మిస్సైల్ ముప్పు నుండి ఐఎన్ఎస్ ధ్రువ్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది?
బాలిస్టిక్ క్షిపణులు బాలిస్టిక్ రూట్ (పారాబోలా) ను అనుసరిస్తాయి అని అంటారు. అంటే భూమి నుంచి లేదా దేనినుంచైనా ఈ క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్లి, ఆపై శత్రువులు దాగి ఉన్న ప్రదేశాన్ని నాశనం చేస్తాయి. ఐఎన్ఎస్ ధ్రువ్ రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఇలాంటి సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా కొన్ని దశల్లో ఇలా పని చేస్తుంది ...
శత్రువులు బాలిస్టిక్ క్షిపణిని సముద్ర ప్రాంతం నుండి ప్రయోగించిన వెంటనే ఐఎన్‌ఎస్ ధృవ్ పని ప్రారంభమవుతుంది. ముందుగా శత్రువులపై నిఘా ఉంచిన శాటిలైట్ క్షిపణిని ప్రయోగించిన వెంటనే గుర్తించగలవు.అయితే క్షిపణి వేగం, దూరం, దిశ గురించి పూర్తి సమాచారం ఈ ట్రాకింగ్ షిప్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఐఎన్‌ఎస్ ధృవ్‌పై అమర్చిన రాడార్ వ్యవస్థ దానిని గుర్తిస్తుంది. దీని తరువాత ఈ సమాచారం మొత్తం భూమిపై ఉన్న మరొక షిప్ లేదా వైమానిక రక్షణ వ్యవస్థకు పంపబడుతుంది, వైమానిక రక్షణ వ్యవస్థ దాడి చేసేందుకు వస్తున్న బాలిస్టిక్ క్షిపణిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది.