సెన్సేషనల్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ పై నేటికీ ఏడాది.. త్వరలో మళ్ళీ రి-లాంచ్ కానుందా..

First Published Jun 30, 2021, 1:26 PM IST

ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన పాపులర్ చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ ని భారత ప్రభుత్వం నిషేధించి నేటికీ ఏడాది. టిక్‌టాక్ తో సహ  వందల కొద్దీ చైనా యాప్‌లను గాల్వన్ లోయ వివాదం కారణంగా నిషేధం విధించారు. యూజర్ల డేటా చోరీ, డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆరోపణల నేపథ్యంలోనూ ఈ నిషేధం వచ్చింది.
 

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ తో పాటు ఆపిల్ యాప్ స్టోర్ నుండి కూడా వీటిని తొలగించారు. భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ఎ రూల్స్ కింద (పబ్లిక్ నుండి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని అడ్డుకోవటానికి ) ఈ నిషధం తీసుకొచ్చారు.
undefined
గూగుల్ ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్, ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పుడు భారతదేశంలో నిషేధించబడిన యాప్స్ లో టిక్‌టాక్, షేరిట్, వీచాట్, హెలో, లైక్, యుసి న్యూస్, బిగో లైవ్, యుసి బ్రౌజర్, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఎం‌ఐ కమ్యూనిటి ఉన్నాయి.
undefined
చైనీస్ టెక్ కంపెనీ బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన టిక్‌టాక్ యాప్ ప్రస్తుతానికి ఇండియా, అమెరికా మినహా మిగతా దేశాల్లో అందుబాటులో ఉంది. మరొక సోషల్ మీడియా యాప్ హేలో కూడా ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో లేదు.
undefined
ఈ ఏడాది మార్చి నాటికి టిక్‌టాక్ యాప్‌ 58 మిలియన్ల డౌన్‌లోడ్స్ కలిగి ఉంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెలలో అత్యధికంగా డౌన్‌లోడ్స్ కలిగిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. మార్క్ జూకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్ సంస్థ 56 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. యాప్‌లపై విశ్లేషణ చేసే సెన్సార్ టవర్ ఈ వివరాలు వెల్లడించింది. అత్యధికంగా చైనాలో 11 శాతం మంది టిక్‌టాక్(TikTok App) డౌన్‌లోడ్ చేసుకోగా, 10 శాతంతో అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉందని సెన్సార్ టవర్ తెలిపింది.
undefined
ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసేంజర్ యాప్‌లు నాన్ గేమింగ్ యాప్‌ల డౌన్‌లోడ్లలో టాప్5లో చోటు దక్కించుకున్నాయి. ఫేస్‌బుక్ యాప్‌ను అత్యధికంగా 25 శాతం భారత్‌లో డౌన్‌లోడ్ చేసుకోగా, 8 శాతం డౌన్ లోడ్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. స్నాప్‌చాట్, జోష్, జూమ్, టెలీగ్రామ్, క్యాప్‌కట్ వంటి యాప్స్ మొదటి 10 యాప్‌లలో చోటు దక్కించుకున్నాయి.
undefined
ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత వివరాలు సైతం ఆన్‌లైన్ వేదికగా హ్యాకర్లు, నిపుణులు పోస్ట్ చేయడం తెలిసిందే. దేశీయ యాప్ షేర్‌చాట్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫామ్ మోజ్ టాప్10లో నిలిచింది.కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు పాటిస్తామని, తమ టిక్‌టాక్ యాప్ దేశంలో పునరుద్దరించాలని బైట్‌డాన్స్ ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని కోరినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది.
undefined
కాగా దేశ ప్రజల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మొత్తం 250 యాప్స్ ను గత ఏడాది బ్యాన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనా దేశానికి చెందిన యాప్స్ ఉన్నాయి. బ్యాన్ చేయడానికి ముందు షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కు దేశంలో 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో వైపు అత్యంత పాపులర్ గేమ్ పబ్ జిని కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే దీనికి పోలిన గేమ్స్ ఇండియన్ వెర్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
undefined
click me!