ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే, వారిని ట్యాగ్ చేయడానికి లేదా పేర్కొనడానికి Instagram మిమ్మల్ని అనుమతించదు. బ్లాక్ చేయబడిందని భావిస్తున్న ప్రొఫైల్ మీ పోస్ట్‌పై ఇంతకు ముందు కామెంట్ చేసినట్లయితే మీరు ఆ కామెంట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి, అకౌంట్ ఉందొ లేదో చెక్ చేయవచ్చు. మీరు మెసేజెస్ చెక్ చేసినప్పుడు మీకు 'Instagram యూజర్' కనిపిస్తే, మీరు బ్లాక్ చేయబడినట్లు అవకాశం ఉంది. Instagramలో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో చెక్ చేయడానికి వేరొక అకౌంట్ ఉపయోగించి వెతకడం ఈజీ మార్గం.