అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో వచ్చే వారం భారతదేశంలో అందుబాటులోకి రానుంది. దీనిని ఇంతకుముందు యు.ఎస్‌లో ప్రారంభించారు. అమాజ్‌ఫిట్ బిప్ యు ఇంకా అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో రెండూ కూడా ఒక విధమైన స్మార్ట్‌వాచ్‌లు. కాకపోతే ఇందులో కొన్ని ఫిచార్స్ పరంగా తేడాలు ఉన్నాయి.
అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో వేరియంట్‌లో మూడు కొత్త ఫీచర్లు జోడించారు. అంటే ఇన్ బిల్ట్ ఇంటర్నల్ జిపిఎస్, మైక్రోఫోన్, జియో మాగ్నెటిక్ సెన్సార్ ఉన్నాయి. ఇవే కాకుండా అమెజాన్ అలెక్సాకు కూడా సపోర్ట్ ఉంది. అమాజ్‌ఫిట్ బిపి యు ప్రస్తుత ధర 3,999 రూపాయలు. అయితే అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోను భారత మార్కెట్లో రూ .4,999 నుంచి రూ .5,999 మధ్య విడుదల చేయనున్నట్లు అంచనా.
దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో 1.43 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 302x320 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. డిస్ ప్లేకి 2.5 డి యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. వాచ్ బాడీ మొత్తం పాలికార్బోనేట్ తో ఉంటుంది. దీనికి 20 ఎంఎం సిలికాన్ బెల్ట్ లభిస్తుంది. అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రో బ్లాక్, గ్రీన్, పింక్ రంగులలో వస్తుంది, దీని బరువు 31 గ్రాములు.
అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో బ్లూటూత్ కాలింగ్ కోసం మైక్రోఫోన్ అందించారు. దీనిలో 230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 9 రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో 60కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, బ్లూడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.