10నిమిషాల ఛార్జింగ్‌తో 9గంటల బ్యాకప్‌ ఇచ్చే నోకియా ఇయర్‌ఫోన్‌లు.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి..

First Published | Apr 5, 2021, 7:10 PM IST

 ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్  మొబైల్ తయారీ సంస్థ నోకియా  బ్లూటూత్ హెడ్‌సెట్ (నెక్‌బ్యాండ్) టి 2000, నోకియా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ANC T3110 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 
 

నెక్‌బ్యాండ్ T2000, ఇయర్‌బడ్స్ ANC T3110 రెండూ చెమట, నీటి నిరోధక రేటింగ్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ QCC3034 బ్లూటూత్ ఆడియో చిప్‌సెట్ నోకియా బ్లూటూత్ హెడ్‌సెట్ T2000 లో అందించారు.
undefined
నోకియా హెడ్‌సెట్ టి 2000, నోకియా ఎఎన్‌సి టి 3110 ధరనోకియా బ్లూటూత్ హెడ్‌సెట్ టి 2000 ధర రూ .1,999, దీనిని మిడ్ నైట్ బ్లాక్, ట్విలైట్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 9 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ హెడ్‌సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ .2,999 ధరతో జాబితా చేశారు. నోకియా ఎఎన్‌సి టి 3110 ధర రూ .39999 అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ .5,999 తో జాబితా చేశారు, ఇది కూడా ఏప్రిల్ 9 నుండి అమ్మకానికి వస్తుంది.
undefined

Latest Videos


నోకియా బ్లూటూత్ హెడ్‌సెట్ T2000 స్పెసిఫికేషన్లుT2000 అనేది క్వాల్‌కామ్ QCC3034 చిప్‌తో కూడిన నెక్‌బ్యాండ్ స్టైల్ బ్లూటూత్ హెడ్‌సెట్. దీనికి SBC, AAC, Qualcomm apt X, aptX HD లకు సపోర్ట్ ఇస్తుంది. దీనికి చెమట, నీటి నిరోధకత కోసం IPX4 గా రేట్ చేయబడింది. 11 ఎంఎం డ్రైవర్, సింగిల్ మైక్రోఫోన్ దీనికి ఉంది. T2000లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.1 ను ఉంది. దీని బ్యాటరీ 14 గంటల బ్యాకప్ కోసం క్లెయిమ్ చేయబడింది. అంతేకాకుండా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 9 గంటల బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
undefined
నోకియా ANC T3110 స్పెసిఫికేషన్లునోకియా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ ANC T3110 12.5mm డ్రైవర్‌ ఉంది. ఇది కూడా నీటి నిరోధకత కోసం IPX7 గా రేట్ చేయబడింది. దీనికి మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి. దీనికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా ఉంది. అలాగే కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.1 ఉంది. ANC T3110 తో SBC కి మాత్రమే సపోర్ట్ ఉంది. దీని బ్యాటరీ 5.5 గంటల బ్యాకప్ ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే ఛార్జింగ్ కేసుతో దాని బ్యాటరీకి సంబంధించి 22 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది.
undefined
click me!