AI Childhood Trend : ఎక్కడ చూసినా ఇదే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్! ఏలా చేయాలి?

Published : May 07, 2026, 05:44 PM IST

AI Childhood Trend : సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ సెల్ఫ్ ఏఐ ఫోటో ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే, చాట్‌ జీపీటీ, జెమిని ఉపయోగించి మీ చిన్ననాటి ఫోటోను ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ చైల్డ్‌హుడ్ సెల్ఫ్ ట్రెండ్.. మీరు ట్రై చేశారా?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ఎక్స్ టైమ్‌లైన్ ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పుడు ఒకే రకమైన ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఇప్పటి మీరు, దానికి ఎదురుగా చిన్నప్పటి మీరు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న ఆ ఫోటోలు చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది కదా! అదేనండి.. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'Viral AI Childhood Photo Trend'. కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, చాట్‌ జీపీటీ, గూగుల్ జెమిని వంటి ఏఐ టూల్స్ మీ జ్ఞాపకాలను అందమైన వెండితెర దృశ్యంలా మార్చేస్తున్నాయి.

గతానికి, వర్తమానానికి మధ్య ఒక కనెక్షన్ లా కనిపిస్తున్న ఈ ట్రెండ్ 2026లో బిగ్గెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్‌గా నిలుస్తోంది. దీని వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటి? మీరు కూడా అలాంటి ఫోటోను ఎలా క్రియేట్ చేసుకోవాలంటే..

25
ఏమిటీ వైరల్ ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్?

సాధారణంగా మనం పాత ఫోటోలను చూసుకుని మురిసిపోతుంటాం. కానీ ఈ ఏఐ ట్రెండ్ అంతకు మించి ఉంది. ఇది పాస్ట్ vs ప్రజెంట్ కాన్సెప్ట్‌తో వస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో చిన్నప్పటి మీ వెర్షన్, ఇప్పటి మీ వెర్షన్ ఎదురెదురుగా కూర్చుని ఉన్నట్టుగా ఈ ఫోటోలు ఉంటాయి.

ఈ ఫోటోలలో ముఖ్యంగా కొన్ని ఫీచర్స్ కనిపిస్తాయి..

• ఒక పక్క చిన్నప్పటి మీరు అమాయకమైన నవ్వుతో కనిపిస్తారు.

• మరో పక్క ఇప్పటి మీరు, మీ చిన్ననాటి వెర్షన్‌ను ఎంతో ప్రేమగా, ఆలోచనలో పడినట్టు చూస్తుంటారు.

• మధ్యలో ఒక టేబుల్, దానిపై మీ ప్రస్తుత వయస్సును సూచించే బర్త్‌డే కేక్ ఉంటుంది.

• మొత్తం ఫోటో బ్లాక్ అండ్ వైట్ లేదా సినిమాటిక్ లైటింగ్‌తో ఒక స్టూడియోలో తీసిన ప్రొఫెషనల్ ఫోటోలా ఉంటుంది.

35
ఎందుకు ఇంతలా వైరల్ అవుతోంది?

ఈ ఏఐ ఫోటో ట్రెండ్ కేవలం ఒక ఎడిటింగ్ మాత్రమే కాదు, ఇదొక ఎమోషన్. యూజర్లు దీనిని ఒక డిజిటల్ థెరపీలా భావిస్తున్నారు. మనం ఎంత దూరం వచ్చాం? అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా ఈ ఫోటోలు ఉంటున్నాయి.

మన చిన్నప్పటి అమాయకత్వాన్ని ఇప్పుడున్న మనం పలకరిస్తున్నట్లు ఉండటంతో, జెన్-జీ నుంచి మిలీనియల్స్ వరకు అందరూ దీనికి కనెక్ట్ అయిపోతున్నారు. అందుకే హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి మరీ లక్షలాది మంది ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇది కేవలం ఫోటో కాదు, మీ జీవిత ప్రయాణాన్ని చెప్పే ఒక విజువల్ స్టోరీ.

45
ఏఐ చైల్డ్‌హుడ్ ఫోటో ట్రెండ్ : వైరల్ ఏఐ ప్రాంప్ట్ ఇదే

మీరు కూడా ఇలాంటి ఫోటోను క్రియేట్ చేసుకోవాలంటే, ఏఐ కి సరైన ప్రాంప్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. కింద ఉన్న ప్రాంప్ట్‌ను కాపీ చేసి మీ ఫోటోలతో కలిపి ఐఏ టూల్స్‌లో వాడండి:

"Create an emotional black-and-white portrait using the photos I have uploaded. Left Side: A childhood version of myself from my old photos, looking toward the right with an innocent smile. Right Side: My current self, seated with my hands resting beneath my chin, gazing at my childhood self with a sense of deep calm and contemplation. Center: A small table featuring a birthday cake with a number representing my current age. Background: Soft studio lighting with a cinematic feel. The image should be photorealistic, with clear skin texture. Aspect Ratio: 4:5."

ఈ ప్రాంప్ట్‌లో మీ వయస్సు లేదా మీకు నచ్చిన కొన్ని మార్పులు చేసుకుని మరింత పర్సనలైజ్ చేసుకోవచ్చు.

55
పర్సనల్ స్టోరీ టెల్లింగ్ వైపు ఏఐ ప్రయాణం

ఒకప్పుడు ఏఐ అంటే కేవలం కార్టూన్లనో లేక వింత రూపాలనో క్రియేట్ చేయడానికి వాడేవారు. కానీ ఇప్పుడు అది మన వ్యక్తిగత కథలను చెప్పడానికి ఉపయోగపడుతోంది. AI నాస్టాల్జియా అనేది ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్. ఫన్ ఎడిట్స్ నుంచి ఫీల్ గుడ్ కంటెంట్ వైపు యూజర్లు మళ్లుతున్నారు.

మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను ఇలా సరికొత్తగా చూడాలనుకుంటే, ఆలస్యం చేయకుండా చాట్‌ జీపీటీ లేదా గూగుల్ జెమిని ఓపెన్ చేసి ఈ చైల్డ్‌హుడ్ సెల్ఫ్ ట్రెండ్‌లో భాగం అవ్వండి.

Read more Photos on
click me!

Recommended Stories