గూగుల్ పే నుండి ఒక రోజులో ఎంత డబ్బు పంపోచ్చు ? రోజు లావాదేవీల పరిమితిని ఎలా పెంచుకోవాలీ..

First Published | Jan 25, 2022, 3:02 AM IST

గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ లావాదేవీల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. షాపింగ్ చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా.. ప్రజలు వారి మొబైల్ నుంచి నిమిషాల్లోనే అన్ని లావాదేవీల పనులూ చేసేస్తునారు. ఈ రోజుల్లో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఎన్నో యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లలో ఒకటి గూగుల్ యజమాన్యంలోని  గూగుల్ పే(google pay).

ప్రతిరోజు లక్షలాది మంది దీని ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. అయితే గూగుల్ పేలో రోజు లావాదేవీలపై కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే గూగుల్ పే ద్వారా మీరు ఒక రోజులో ఎంత నగదు బదిలీ చేయవచ్చనే దానిపై పరిమితిని విధించింది. కానీ కొంతమంది రోజుకు చాలా సార్లు లావాదేవీలు చేయవలసి ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో  గూగుల్ పే మీకు ఇచ్చిన రోజు పరిమితి  తక్కువగా ఉండవచ్చు. 

దీంతో  ఒకోసారి చాలా సమస్యలను ఎదురుకొవాల్సి వస్తుంది.  అయితే ఇందుకు మీరు ఒకటి కంటే ఎక్కువ చెల్లింపు యాప్‌లను ఉపయోగించవచ్చు, కానీ మీరు అలా చేయకూడదనుకుంటే ఈ కొన్ని ట్రిక్‌లను  ఉపయోగించి దీని ద్వారా మీరు గూగుల్ పే సెట్ చేసిన పరిమితి కంటే ఎక్కువ సార్లు చెల్లించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం... 


గూగుల్ పే లావాదేవీ పరిమితి ఎంత?
మీరు గూగుల్ పే ద్వారా ఒక రోజులో రూ. 1 లక్ష వరకు పంపవచ్చు. అంతేకాకుండా ఒక రోజులో గరిష్టంగా 10 లావాదేవీలు చేయవచ్చు. మరోవైపు ఒక రోజులో రూ. 2000 కంటే ఎక్కువ డబ్బు అభ్యర్థనలు చేయలేరు. 

Latest Videos


బ్యాంక్ పరిమితి ఉన్న కూడా వినియోగదారులు గూగుల్ పే నుండి డబ్బును బదిలీ చేయలేకపోవడం కూడా చాలా సార్లు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ బ్యాంక్ పరిమితిని తనిఖీ చేయవచ్చు. 
 

ఈ విధంగా పరిమితి పెంపు చేయవచ్చు 
సాధారణంగా, గూగుల్ పేలో చెల్లింపు పరిమితిని పెంచడానికి సులభమైన మార్గం లేదు. కానీ మీ వ్యాపారం దీనిపై పనిచేస్తుంటే, కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు యూ‌పి‌ఐ పరిమితిని పెంచమని అభ్యర్థించవచ్చు. 

అంతేకాకుండా మీరు గూగుల్ పే కస్టమర్ సర్వీస్‌తో మాట్లాడటానికి అధికారిక వెబ్‌సైట్ https://support.google.com/pay/india/?hl=en#topic=10094979ని సందర్శించి సహాయం పొందవచ్చు. 

click me!