కెమెరా నుండి పర్సనల్ డాటా వరకు ఐఫోన్‌ను వాడటం వల్ల 8 ప్రయోజనాలు ఇవే..

First Published | Jan 22, 2022, 12:15 PM IST

అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజి కంపెనీ ఆపిల్(apple) "స్విచ్ టు ఐఫోన్" (switch to iphone)అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ వరకు కలిగే ప్రయోజనాలను కంపెనీ ప్రజలకు తెలియజేస్తోంది. అలాగే ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌కి మారడం వల్ల కస్టమర్లకు అత్యుత్తమ గోప్యత, భద్రత లభిస్తుందని ఆపిల్ తెలిపింది. 

అంతేకాకుండా సాఫ్ట్‌వేర్ అప్ డేట్ లు చాలా కాలం పాటు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే  ప్రయోజనాల ఏంటి వాటి గురించి తెలుసుకుందాం.... అయితే వీటి గురించి ఆపిల్ స్వయంగా సమాచారం ఇచ్చింది... 

ఐఫోన్‌కు మారడం ఎంత సులభం?
ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి వెళ్లడం చాలా సులభం అని యాపిల్ తెలిపింది. మీరు కొత్త ఐఫోన్‌ను సెటప్ చేసినప్పుడల్ల మీరు డేటాను ట్రాన్సఫర్ చేసే ఆప్షన్ పొందుతారు, దీని సహాయంతో మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్  ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ ఒకే క్లిక్‌తో ఐఫోన్ కి ట్రాన్సఫర్ చేయవచ్చు.

ఐ‌ఓ‌ఎస్ యాప్
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూవ్ టు ఐ‌ఓ‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  దీంతో మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మీ అన్ని కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, ఇమెయిల్ అక్కౌంట్స్, క్యాలెండర్ డేటాను మీ ఐఫోన్ కి ట్రాన్సఫర్  చేస్తుంది.

ప్రైవసీ
ఐఫోన్‌తో మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని  అని ఆపిల్ పేర్కొంది. ప్రతి ఐఫోన్‌లో సురక్షితమైన ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ అతేంటికేషన్ ఉంటుంది. అంతేకాకుండా మీ అనుమతి లేకుండా ఐఫోన్‌లోని ఏ యాప్ మిమ్మల్ని ట్రాక్ చేయదు. మీ  ఐమెసేజెస్ (iMessages) అండ్  ఫేస్ టైమ్ (FaceTime)వీడియో కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుండి.


అప్ డేట్ 
ఐ‌ఓ‌ఎస్ లో అప్‌డేట్‌లు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటాయి. ఏదైనా కారణం వల్ల బగ్ గురించి సమాచారం అందితే, దాన్ని పరిష్కరించడానికి కంపెనీ వెంటనే అప్‌డేట్‌ను జారీ చేస్తుంది.

ఉపయోగించడం సులభం
అపిల్ ప్రకారం, కంపెనీ ఇంజనీర్లు వినియోగదారులు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఐఫోన్‌ను రూపొందించారు. సెకన్లలో ఫైల్‌లను షేర్ చేయడానికి AirDrop వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎయిర్‌పాడ్ లేదా ఆపిల్ వాచ్‌ను కూడా ఒక ట్యాప్‌లో కనెక్ట్ చేయవచ్చు.

బిల్ట్ క్వాలిటీ
ఆపిల్ ప్రకారం కొత్త ఐఫోన్ మోడల్‌లో సిరామిక్ షీల్డ్ ఉంది, అంటే ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న గాజు కంటే బలంగా ఉంటుంది. దీనిపై నీటి ప్రభావం ఉండదు. అన్ని ఐఫోన్ లు IP68 రేటింగ్‌తో వస్తాయి.

అడ్వాన్స్ కెమెరాలు
కొత్త ఐఫోన్‌లు అధునాతన కెమెరా ఫీచర్లతో వస్తున్నాయి. కొత్త ఐఫోన్‌లో మీరు మెరుగైన నైట్ మోడ్ నుండి సినిమాటిక్ వీడియో మోడ్‌ పొందుతారు. సినిమాటిక్ మోడ్ మీ సినిమా వీడియోలకు డెప్త్-ఆఫ్-ఫీల్డ్ ఎఫెక్ట్‌లను జోడిస్తుంది, ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్
ఆపిల్  ఐఫోన్‌లో సొంతంగా రూపొందించిన ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్ A-15 బయోనిక్ ప్రాసెసర్‌తో పరిచయం చేసింది, ఇందులో న్యూరో ఇంజన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి.

Latest Videos

click me!