Bluetooth speaker: ఇంట్లోనే పబ్ ఫీలింగ్ రావాలంటే ఈ బ్లూటూత్ స్పీకర్ బెస్ట్ ఆప్షన్..కళ్లు చెదిరే ఫీచర్ కూడా

Published : Oct 15, 2026, 02:45 PM IST

Bluetooth speaker: తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందించే పోర్టబుల్ స్పీకర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే సౌండ్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి సదుపాయాలను ఇస్తున్నాయి. కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

PREV
14
తక్కువ ధరకే బోల్డన్ని ఫీచర్లు

తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు అందించే పోర్టబుల్ స్పీకర్లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది. ఈ పోటీని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మెరుగైన సౌండ్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి సదుపాయాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన Hammer Wave 2 స్పీకర్ సుమారు రూ.1,200 ధరలో 20W RMS అవుట్‌పుట్, డ్యూయల్ డ్రైవర్లు, Bluetooth 6.0, RGB లైట్లను అందిస్తోంది. మరి తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్పీకర్ పనితీరు ఎలా ఉంది?

24
పబ్ ఫీలింగ్ ఇస్తుంది

Hammer Wave 2 స్పీకర్‌ను ఇంట్లో డెస్క్‌పై పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు మరోచోటికి సులభంగా తీసుకెళ్లవచ్చు. కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చిన ఈ స్పీకర్ ముందు భాగంలో RGB లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటలు ప్లే అవుతున్నప్పుడు లైట్లు వెలుగుతూ మారుతుంటాయి. ముఖ్యంగా తక్కువ వెలుతురు ఉన్న గదుల్లో మ్యూజిక్ వింటున్నప్పుడు పబ్, పార్టీ వాతావరణాన్ని కలిగిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో స్పీకర్ కొనాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకుని దీని డిజైన్‌ను రూపొందించారు. అయితే, దీని ప్రధాన ఆకర్షణ రూపం మాత్రమే కాదు.. ధరకు తగిన సౌండ్, కనెక్టివిటీ ఫీచర్లు కూడా.

34
చిన్న గదిలో సౌండ్ అదిరిపోద్ది

ఈ స్పీకర్‌లో 20W RMS అవుట్‌పుట్, రెండు డ్రైవర్లు ఉన్నాయి. ఇంట్లో పాటలు వినడానికి, వీడియోలు చూడటానికి, పని చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం దీని సౌండ్ సరిపోతుంది. చిన్న గదిలో కూడా మంచి సౌండ్ ఇస్తుంది.

44
అయితే ఇది కూడా తెలుసుకోండి

Hammer Wave 2లో Bluetooth 6.0 కనెక్టివిటీ ఉంది. ఫోన్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసి పాటలు వినవచ్చు. అయితే కనెక్ట్ చేసిన స్మార్ట్‌ఫోన్‌ను స్పీకర్‌కు దూరంగా ఉంచినప్పుడు లేదా మరో గదిలోకి తీసుకెళ్లినప్పుడు కనెక్షన్ సరిగ్గా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫోన్‌ను దగ్గరగా ఉంచాల్సి వస్తుంది. అందువల్ల, బ్లూటూత్ ద్వారా దూరం నుంచే స్పీకర్‌ను ఉపయోగించాలనుకునేవారు దీన్ని గుర్తించాలి. Bluetooth 6.0 అనే ఫీచర్ ఉన్నంత మాత్రాన ప్రతి పరిస్థితిలోనూ కనెక్టివిటీ పరిధి మెరుగ్గా ఉంటుందని భావించకూడదు. సుమారు రూ.1,100 ధరలో 20W RMS అవుట్‌పుట్, డ్యూయల్ డ్రైవర్లు, RGB లైట్లు, Bluetooth 6.0 వంటి ఫీచర్లు Hammer Wave 2కు ప్లస్ పాయింట్లు. ఇంట్లో సాధారణంగా పాటలు వినడం, వీడియోలు చూడటం, చిన్న సమావేశాల్లో మ్యూజిక్ ప్లే చేయడం వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories