డిజైన్, బిల్డ్ క్వాలిటీ : గ్రేడ్-4 టైటానియం బాడీ, సఫైర్ క్రిస్టల్ గ్లాస్‌తో ఈ వాచ్‌ను చాలా స్ట్రాంగ్‌గా తయారు చేశారు. 10 ATM వాటర్ రెసిస్టెన్స్, EN13319 డైవింగ్ సర్టిఫికేషన్ ఉండటంతో స్పోర్ట్స్ ఆడేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్.
డిస్‌ప్లే : స్మార్ట్‌వాచ్‌లలోనే అత్యంత ప్రకాశవంతమైన 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 1.52-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్, బ్యాటరీ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్ ప్రాసెసర్, 2GB ర్యామ్‌తో ఇది పనిచేస్తుంది. 800mAh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 80 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు.
స్పెషల్ ఫీచర్లు : డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, 86 డెసిబెల్స్ సౌండ్ ఇచ్చే ఎమర్జెన్సీ సైరన్, ఫాల్ డిటెక్షన్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.