ఈ రోజు అలంటి BSNL ప్లాన్ గురించి మీకోసం, దీని ద్వారా మీరు రీఛార్జ్ చేసిన తర్వాత 6 నెలల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే, ఈ ప్లాన్ ఎక్కువ రోజుల వాలిడిటీ ఇంకా ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే రీఛార్జ్ ధర కూడా చాలా తక్కువ.
మీరు ఈ BSNL ప్లాన్‌ని రూ.500 కంటే తక్కువ ధరకే ఆక్టివేట్ చేసుకోవచ్చు. దీని ధర 498 రూపాయలు మాత్రమే. ఈ BSNL ప్లాన్ మరొక ప్రత్యేక ఫీచర్ 180 రోజులు లేదా 6 నెలల వాలిడిటీ. అంటే మీరు 6 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ నుండి రిలీఫ్ పొందుతారు. BSNL ఈ ప్లాన్ చాలా తక్కువ ధరకు ఇతర నెట్వర్క్ కంపెనీల కంటే సాటిలేని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో BSNL నెట్‌వర్క్‌కి కాల్స్ నిమిషానికి 10 పైసలు మాత్రమే.
ఈ ప్లాన్‌తో ఇతర నెట్వర్క్ కాల్స్ కి నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తుంది. ప్లాన్‌తో యూజర్ కి రూ.100 టాక్‌టైమ్ లభిస్తుంది. ఎక్కువ వాలిడిటీ ప్లాన్‌ను కోరుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ఏదైనా సిమ్‌ని ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచడానికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
టెలికాం కంపెనీలు గత కొన్ని నెలల్లో ప్రీపెయిడ్ అండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను చాల శాతం పెంచాయి. జియో అండ్ ఎయిర్‌టెల్ దేశంలో టాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లుగా కొనసాగుతున్నాయి కానీ వీటి మొబైల్ రీఛార్జ్‌లు ఇప్పుడు చాలా కాస్ట్లీ గా మారాయి. ప్రస్తుతం, కస్టమర్‌లు 28 లేదా 30 రోజుల ప్లాన్ కోసం 200 దాక లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీరు కూడా ఇంత ఎక్కువ ధరతో మొబైల్ రీఛార్జ్‌తో విసిగిపోయి ఉంటే, మీరు BSNL ఈ అత్యంత బడ్జెట్ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు BSNL కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌ను కూడా చూడవచ్చు.