దీని ఉపయోగం యూజరుకి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని వీరా(Veera) పేర్కొంది. ఇంకా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను సహాయపడుతుంది. అలాగే ఈ బ్రౌజర్ చాలా సేఫ్ కూడా. ఈ బ్రౌజర్ క్రాష్ కాదని వీర తెలిపింది. "భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన ఇంకా ప్రైవేట్ బ్రౌజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడమే మా లక్ష్యం. భారతదేశ విశిష్టతతో ప్రతిధ్వనించే ఇంటర్నెట్ అనుభవాన్ని సృష్టించడానికి మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము" అని వీర ఫౌండర్ అర్జున్ ఘోష్ అన్నారు.
భారతీయులు ప్రతిరోజూ 7.3 గంటలు ఆన్‌లైన్‌లో
ఒక సగటు మొబైల్ యూజర్ ప్రతిరోజూ దాదాపు 7.3 గంటల పాటు ఆన్‌లైన్‌లో ఉంటున్నారని అర్జున్ ఘోష్ చెప్పారు. 10 లక్షల భారతీయులు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీర తప్పకుండా వారికి కొత్త అనుభూతిని పంచుతుంది. "ఈ లాంచ్ ప్రారంభం మాత్రమే అని నేను మీకు హామీ ఇస్తున్నాను. ముందుముందు చాలా ఫీచర్లు ఉన్నాయి. మేము దాని గురించి చాలా సంతోషిస్తున్నాము ఇంకా త్వరలో వాటిని ప్రారంభిస్తాము" అని ఘోష్ చెప్పారు.
వీరా స్పీడ్ పరంగా బెంచ్ మార్క్ సెట్
అర్జున్ ఘోష్ మాట్లాడుతూ, "వీరా స్పీడ్ పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. వీరా స్పీడోమీటర్‌లో నిమిషానికి 40.8 రన్స్ సాధించింది. ఇంకా ఇతర బ్రౌజర్‌ల కంటే ముందంజలో ఉంది." వీరలో లైవ్ ట్రాకర్ సౌకర్యం కల్పించబడింది. దీని ద్వారా బ్లాక్ చేయబడిన యాడ్స్ రియల్ టైంలో లెక్కించడానికి యూజర్లకు సహాయాపడుతుంది. దీనితో పాటు యూజర్ డేటాను కూడా సేవ్ చేస్తుంది.
వీర సహాయంతో ట్రాకర్లను బ్లాక్ చేయవచ్చు. థర్డ్-పార్టీ ట్రాకర్‌లు, యాడ్స్, ఆటోప్లే వీడియోలు ఇంకా మరిన్నింటిని డిఫాల్ట్‌గా బ్లాక్ చేయడానికి veera మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ ప్రత్యేకంగా Android డివైజెస్ లో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో iOS అండ్ Windows వెర్షన్‌లను తీసుకొచ్చే ప్లన్స్ ఉన్నాయి అని తెలిపింది.