ఈ రోజే గూగుల్ పిక్సెల్ కొత్త సిరీస్ లాంచ్‌.. ఫీచర్స్, ప్రి-బుకింగ్స్, ధర వివరాలు ఇవే ..?

First Published | Oct 4, 2023, 1:02 PM IST

టెక్ దిగ్గజం  గూగుల్ పిక్సెల్ 8 సిరీస్  నేడు అక్టోబర్ 4 బుధవారం షెడ్యూల్ చేసిన 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ ద్వారా  ప్రవేశపెట్టాబోతున్నారు. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ సిరీస్ అండ్  పిక్సెల్ వాచ్‌ 2తో సహా కొత్త  ఆకర్షణీయమైన ప్రొడక్ట్స్  కూడా  విడుదల చేయనుంది. అయితే ఈ ఈవెంట్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు కూడా భావిస్తున్నారు.

 లాంచ్ ఈవెంట్‌  ఎక్కడ 
ఈ ఈవెంట్ Google అఫీషియల్ YouTube ఛానెల్‌లో  లైవ్  టెలికాస్ట్  చేయనుంది. అయితే గూగుల్ ఈవెంట్ న్యూయార్క్‌లో జరగనుంది. ఈవెంట్ ఉదయం 10 ET ( ఇండియాలో సాయంత్రం 7.30 IST)కి ప్రారంభం కానుంది. టెక్ ఔత్సాహికులు Google వెబ్‌సైట్‌లో ఈవెంట్ గురించి అన్ని అప్‌డేట్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు.
 

Pixel 8 అండ్ Pixel 8 Pro ఫీచర్లు
లాంచ్ లో  వైడ్ రేంజ్  ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ  ఈవెంట్‌లో గూగుల్  పిక్సెల్ 8 అండ్ పిక్సెల్ 8 ప్రో హైలైట్‌  గా ఉంటాయి. రెండు  మోడల్స్    పిక్సెల్ 7 ఇంకా  పిక్సెల్ 7 ప్రోతో పోలిస్తే గొప్ప అప్‌గ్రేడ్‌ తో ఉంటాయని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, పిక్సెల్ 8 ప్రో 6.7 అంగుళాల స్టాండర్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా, అయితే పిక్సెల్ 8 డివైజ్ 6.17-అంగుళాల డిస్‌ప్లేతో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.


Pixel 8 Pro 50 MP వైడ్ లెన్స్, 48 MP టెలిఫోటో లెన్స్‌తో  కెమెరా అప్‌గ్రేడ్స్ ఆశించవచ్చు. ఈ డివైజ్ బాడీ టెంపరేచర్  రీడింగ్ ఫీచర్‌తో పాటు మాక్రో ఫోకస్‌తో 48 MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, పిక్సెల్ 8 ఫోన్‌లో మాక్రో ఫోకస్‌తో 12 ఎంపీ అల్ట్రావైడ్‌తో పాటు 50 ఎంపీ వైడ్ లెన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, రెండు మోడళ్లు DSLR-స్టయిల్  కంట్రోల్స్ అలాగే మ్యాజిక్ ఎడిటర్‌తో సహా AI-బేస్డ్ ఎడిటింగ్ ఫీచర్స్ ఉంటాయని ఊహిస్తున్నారు.
 

  పిక్సెల్ 8 మోడల్ 8 జిబి ర్యామ్‌తో పిక్సెల్ 8 ప్రో 12 జిబి ర్యామ్‌తో ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే  120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో   వస్తుందని అంచనా.  Google ఈ డివైజెస్ కి ఏడేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అందించవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 బ్లాక్, గ్రే అండ్ పింక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుందని అయితే పిక్సెల్ 8 ప్రో బ్లాక్, పింగాణీ అండ్  స్కై బ్లూ వేరియంట్‌లలో   ఉంటుంది.
 

Google Pixel 8 అండ్ Pixel 8 Pro ధర అంచనా.. 
Pixel 8 అండ్ Pixel 8 Pro అఫీషియల్ ధరలు ఇప్పటికీ ఇంకా వెల్లడికాలేదు. అయితే, కొన్ని పుకార్ల ప్రకారం, Pixel 8 ప్రారంభ ధర $699 (దాదాపు రూ. 58,000)గా అంచనా వేయవచ్చు. Pixel 8 Pro ప్రారంభ ధర $999 (సుమారు రూ. 83,000)గా ఉండవచ్చు.

Latest Videos

click me!