ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా రోజూ 3జీబీ డేటా.. జియో సూపర్ ప్లాన్.. ఎవరికంటే..?

First Published | Oct 3, 2023, 12:30 PM IST

డైలీ డేటా సరిపోవట్లేదా ఎక్కువ డేటా ప్లాన్ కోసం చూస్తున్నారా  అయితే మీకోసం జియో ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది.  దీనితో పాటు ఉచిత Netflix అండ్ 3 నెలల పాటు ఆన్ లిమిటెడ్  కాల్స్  చేసుకోవచ్చు.
 

కొన్ని నెలల క్రితం జియో  కొన్ని  ప్రీపెయిడ్ ప్లాన్‌లని మార్చేసింది. దీనితో పాటు కస్టమర్లకు ఉచిత OTT ప్రయోజనాలను అందించింది. అయితే కొన్ని వారాల క్రితం ముఖేష్ అంబానీకి చెందిన జియో కస్టమర్ల కోసం కొన్ని అప్ డేట్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. దీనితో  పాటు నెట్‌ఫ్లిక్స్ వంటి పాపులర్ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్  కూడా అందిస్తుంది.

జియో యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్రతి ధర విభాగంలో విభిన్న డేటా అండ్ వాయిస్ కాల్స్  అందించే కాంబో ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా ప్రతిరోజూ 3GB డేటాతో ఉచిత Netflix కూడా. జియో రూ. 1499 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ  అందిస్తుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 3GB డేటాను అందిస్తుంది.
 

జియో కస్టమర్లు ఈ ప్లాన్‌తో మొత్తం 252GB 4G డేటాను పొందవచ్చు. డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. జియో  ఈ ప్లాన్‌తో యూజర్లకు 3 నెలల పాటు ఆన్ లిమిటెడ్  వాయిస్ కాలింగ్ సౌకర్యం ఇవ్వబడుతుంది. అంటే దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా మీరు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.
 


అంతే కాకుండా, ఈ ప్లాన్‌తో  రోజు 100 SMSలు కూడా ఉచితంగా లభిస్తాయి. మీరు OTTలో కంటెంట్‌ని చూడాలనుకుంటే, ఈ ప్లాన్ మీకు చాల ఉపయోగకరంగా ఉంటుంది. Jio నుండి ఈ రీఛార్జ్ ప్యాక్‌లో Netflix (బేసిక్) సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అంటే, ఈ ప్యాక్ వాలిడిటీ  ఆయిపోయే  వరకు, మీరు నెట్‌ఫ్లిక్స్‌లోని వీడియో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే  ఈ ప్లాన్‌లో JioTV, JioCinema, JioCloud   ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
 

జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌తో కస్టమర్‌లకు జియోసినిమా ప్రీమియం కంటెంట్ అందించబడదని జియో తెలిపింది. విశేషమేమిటంటే, మీరు Jio  5G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్‌లో డేటా క్యాప్ ఉండదు, అంటే ఈ రీఛార్జ్‌లో మీరు ఆన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. Jio   పోర్ట్‌ఫోలియోలో ఇలాంటి  మరో 3 ప్లాన్‌లు ఉన్నాయి.
 

ఈ ప్లాన్‌ల ధరలు రూ.999, రూ.399 అండ్ రూ.219. ఈ మూడింటి వాలిడిటీ 84 రోజులు, 28 రోజులు ఇంకా 14 రోజులు. ఇవన్నీ ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇంకా రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. జియో యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందించబడుతుంది.
 

Latest Videos

click me!