Google Photos కొత్త రూపు: చూపు తిప్పుకోలేరు

మనం తీసుకున్న ఫొటోల్ని అందంగా, సంవత్సరం, నెల, రోజువారీగా అమర్చి పెట్టే యాప్ గూగుల్ ఫొటోస్.  ఆ యాప్ కొత్త డిజైన్, కొత్త రూపంలో వస్తోంది. గుండ్రటి మూలలు, తేలియాడే కింద బార్, మారిన లోగో.. చూపుతిప్పుకోకుండా ఉన్నాయి. అసలింతకు అందులో ఏమేం మార్పులు రానున్నాయో తెలుసుకోండి.

Google photos redesign sneak peek what you need to know in telugu
డిజైన్‌లో భారీ మార్పులు

గూగుల్ ఫొటోస్ యాప్ సమూలంగా మారనుంది. కొత్త సమాచారం ప్రకారం, గూగుల్ కొంతమంది యూజర్లకు సర్వే లింక్‌లను పంపింది. అందులో ప్రస్తుత డిజైన్, కొత్త డిజైన్‌ను పోల్చి అభిప్రాయాలను అడిగింది. వాళ్లందరిలో ఎక్కువమంది దేనికి ఓటు వేశారో.. దాని ప్రకారం ఓకే చేయనుంది. దాంతో కొత్త డిజైన్‌లో చాలా మార్పులు ఉంటాయంటున్నారు.

Google photos redesign sneak peek what you need to know in telugu
గుండ్రటి మూలలు

ఫోటోల ఫ్రేమ్ త్వరలో గుండ్రటి మూలలతో రానుంది. ఇది యాప్‌కు మరింత అందమైన రూపాన్ని ఇస్తుంది.

తేలియాడే కింద బార్:

కొత్త "వెతకండి లేదా అడగండి" బార్ యాప్ కింద ఉంటుంది. కుడి వైపున చతురస్రాకారపు బటన్ ఉంటుంది. ఇది కలెక్షన్ పేజీకి షార్ట్‌కట్ అవుతుంది.


మారిన లోగో

ఎడమవైపు పైన "గూగుల్ ఫోటోస్" అని రాసే బదులు, చిన్న యాప్ ఐకాన్ ఉంటుంది. ఇది యాప్‌ను మరింత తేలికగా చేస్తుంది. గూగుల్ ఫిల్టర్, సెలక్షన్ ఐకాన్‌లను ఆధునిక రూపంలోకి మార్చింది. "జ్ఞాపకాలు" విభాగంలో రాత శైలి మెరుగుపరిచారు.

డిజైన్ ఖరారు అయిందా?

ప్రస్తుతం, గూగుల్ ఈ మార్పులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సర్వే చిత్రాలు గూగుల్ కొత్త డిజైన్‌పై లోతుగా పనిచేస్తోందని సూచిస్తున్నాయి. ఇది భవిష్యత్తు అప్‌డేట్‌లో విడుదల కావచ్చు. ఈ మార్పులు గూగుల్ ఫోటోస్ యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు.

Latest Videos

vuukle one pixel image
click me!