Tech News: ఈ సన్‌గ్లాసెస్‌ ధర అక్షరాల రూ. ​50 వేలు.. ఏం టెక్నాలజీ సామీ, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.

Narender Vaitla | Published : Apr 1, 2025 2:02 PM
Google News Follow Us

టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. సరికొత్త గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతోంది. ఈ జాబితాలోకి వస్తుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న సన్‌ గ్లాసెస్‌. చూడ్డానికి సాధారణ గ్లాసెస్‌గానే కనిపిస్తున్నా వీటిలోని అధునాతన ఫీచర్ల గురించి తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. 
 

14
Tech News: ఈ సన్‌గ్లాసెస్‌ ధర అక్షరాల రూ. ​50 వేలు.. ఏం టెక్నాలజీ సామీ, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.
Rayban smart glasses

ప్రముఖ సన్‌ గ్లాసెస్‌ సంస్థ రేబాన్‌, మెటా కలిసి ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు. ఈ గ్లాసెస్‌లో మెటా AI ఇంటిగ్రేషన్‌ను అందించారు. దీంతో గ్లాసెస్‌తోనే ఫొటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్‌ చేయొచ్చు, వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్‌ కెమెరాను అందించారు. 

24
rayban-smart-glasses features

దీంతో మీరు చూస్తున్న ప్రదీ దృశ్యాన్ని రికార్డ్‌ చేయొచ్చు. 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో అందించిన ఓపెన్‌-ఇయర్‌ ఆడియో సిస్టమ్‌ ద్వారా ఎంచక్కా పాటలు కూడా వినొచ్చు అంతేకాదు కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక మీ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను గ్లాసెస్‌లలో చూసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్‌ కూడా చేసుకోవచ్చు. 

34
rayban-smart-glasses features

మీరు చూస్తున్న ప్రతీ దృశ్యాన్ని ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్‌ను లైట్‌ వెయిట్‌తో డిజైన్‌ చేశారు. దీంతో ధరించడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ధర విషయానికొస్తే ఈ గ్లాసెస్‌ అమెజాన్‌లో సుమారు రూ. 46 వేలకు అందుబాటులో ఉంది. 

Related Articles

44
rayban-smart-glasses features

ఈ సన్‌గ్లాసెస్‌ను హై-పర్ఫార్మెన్స్ లెన్స్‌లు సన్, పాలరైజ్డ్ లేదా ట్రాన్సిషన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అత్యద్భుతమైన స్పష్టత, సౌకర్యం, 100% UVA & UVB రక్షణను అందిస్తాయి. ఈ గ్లాసెస్ లైనెన్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ ద్వారా గ్లాసెస్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్‌ ధర 315 గ్రాములుగా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ గ్లాసెస్‌పై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ లభిస్తుంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 1379 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.   

Read more Photos on
Recommended Photos