సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వారికి కచ్చితంగా కోడింగ్ రావాలని తెలిసిందే. కోడింగ్ వచ్చిన వారికే మంచి అవకాశాలు ఉంటాయని అంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కోడింగ్ అవసరం లేకుండానే యాప్స్ డెవలప్ చేసే రోజులు వచ్చేశాయ్.
సాధారణంగా యాప్ లేదా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంటే కోడింగ్ తప్పనిసరి అనుకుంటాం. వివిధ ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం సాధించేందుకు కోచింగ్ వెళ్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితి మారుతోంది. ఇప్పుడు కోడింగ్ లేకుండానే యాప్ తయారు చేయడం సాధ్యమవుతుందని గూగుల్ నిరూపించింది.
25
గూగుల్ ఓపాల్ – కొత్త ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్
గూగుల్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఓపాల్ అనే ప్రయోగాత్మక టూల్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఇది సహజ భాషలో ఇచ్చే సూచనలు, విజువల్ ఇంటర్‌ఫేస్ సాయంతో యాప్‌లను తయారు చేసే అవకాశం ఇస్తుంది. ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా సులభంగా డిజైన్ చేయగలిగే విధంగా దీనిని రూపొందించారు.
35
జెమిని, వీయో, ఇమాజెన్ సపోర్ట్
ఓపాల్ ద్వారా యాప్ అభివృద్ధి చేసే సమయంలో గూగుల్ ఇతర ఏఐ మోడల్స్‌ను కూడా సమన్వయం చేస్తోంది. జెమిని 2.5 కంటెంట్ సపోర్ట్ అందిస్తే, వీయో 3 వీడియోలను, ఇమాజెన్ 4 చిత్రాలను సృష్టిస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల యాప్‌లో అవసరమైన మీడియా ఎలిమెంట్స్ సులభంగా లభిస్తాయి.
ఓపాల్‌లో ముందే సిద్ధం చేసిన యాప్ టెంప్లేట్లు ఉంటాయి. ఇవి విక్స్, స్క్వేర్‌స్పేస్ వంటి వెబ్‌సైట్ బిల్డింగ్ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా ఉంటాయి. ప్రతి టెంప్లేట్ విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఉదాహరణకు వర్చువల్ గేమ్‌లు డిజైన్ చేయడం, లేదా ప్రేక్షకుల కోసం వీడియో ప్రకటనలు సృష్టించడం వంటి పనులకు వీటిని ఉపయోగించవచ్చు.
55
ప్రాసెస్ చాలా సులభం
ఓపాల్‌లో యాప్ తయారీ దశలవారీగా బాక్స్‌ల రూపంలో కనిపిస్తుంది. ప్రతి దశలో మోడల్ ఏ పని చేస్తుందో యూజర్లు క్లిక్ చేసి చూడవచ్చు. అవసరమైతే వారు నేరుగా మార్పులు కూడా చేయవచ్చు. పై భాగంలో ఉన్న షేర్ ఆప్షన్ ద్వారా ప్రైవేట్ లేదా పబ్లిక్ మోడ్‌లో యాప్‌ను షేర్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అకౌంట్ ఉన్న ఎవరితోనైనా లింక్‌ను షేర్ చేయడం సులభం.