Google AI video Tool: OpenAI సోరాకు దిమ్మదిరిగే షాక్.. గూగుల్ AI వీడియో టూల్ అదిరింది !

Published : May 22, 2025, 09:52 AM ISTUpdated : May 22, 2025, 09:53 AM IST

Google Veo 3 AI video tool: గూగుల్ కొత్త AI వీడియో జనరేటర్ టూల్ వియో 3 (Google Veo 3 AI video tool)ను ప్రారంభించింది. ఇది టెక్స్ట్, ఫొటోల సూచనలతో కంప్లీట్ వీడియోలను రెడీ చేసి ఇస్తుంది.

PREV
16
గూగుల్ ఏఐ విడియో జనరేటర్ టూల్ వియో 3

Google Veo 3 AI video tool: గూగుల్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ తన థర్డ్ జనరేషన్ AI ఆధారిత వీడియో జనరేటర్ టూల్ అయిన వియో 3 (Google Veo 3 AI video tool) అధికారికంగా Google I/O 2025 కార్యక్రమంలో ప్రకటించింది. ఇది OpenAI సోరా (Sora) కు పోటీగా గూగుల్ తీసుకువ‌చ్చింద‌ని చెప్పొచ్చు.

26
సూపర్ ఫీచర్లతో గూగుల్ ఏఐ విడియో జనరేటర్ టూల్ వియో 3

వియో 3ను ఉపయోగించి యూజ‌ర్లు టెక్స్ట్, ఫొటోల సూచ‌న‌లు అందిస్తే కంప్లీట్ మీడియోను మీకు రెడీ చేసి అందిస్తుంది. మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే వీడియోల్లో సింక్రనైజ్ చేసిన ఆడియో, డైలాగ్స్, మ్యూజిక్ వంటి అంశాలు కూడా ఉండటం విశేషం. లాంగ్వేజ్ స‌బ్ టైటిల్స్ కూడా ఇస్తుంది.

36
అమెరికాలోనే అందుబాటులోకి గూగుల్ వియో 3 ఏఐ వీడియో టూల్

ప్రస్తుతం వియో 3 టూల్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. వ్యక్తిగత వినియోగదారుల కోసం ఇది AI Ultra సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లో భాగంగా అందిస్తోంది గూగుల్. ఈ ప్లాన్ ధర $249.99 అందుబాటులో ఉండ‌గా, తొలి మూడు నెలలకు 50% డిస్కౌంట్ ను అందిస్తోంది. సంస్థలు మాత్రం ఈ టూల్‌ను Google Vertex AI ద్వారా ప్రైవేట్ ప్రివ్యూ రూపంలో యాక్సెస్ చేయవచ్చు.

46
భారత్ లో గూగుల్ ఏఐ వీడియో టూల్ అందుబాటులో ఉందా?

గూగుల్ ప్రకారం ప్రస్తుతం వియో 3 టూల్ భారత్ లో అందుబాటులో లేదు. గూగుల్ భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా ఈ టూల్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది. భారతీయ వినియోగదారులు, సంస్థలు ఈ సేవలను ఉపయోగించాలంటే గూగుల్ ప్రకటించే అధికారిక ప్ర‌క‌ట‌న కోసం వేచి చూడాల్సిందే.

56
గూగుల్ వియో 3ను ఎలా ఉపయోగించాలి?

గూగుల్ వియో 3ను ఉపయోగించేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

1. AI Ultra సబ్‌స్క్రిప్షన్‌కు సైన్ అప్ చేయాలి.

2. మీ డివైస్ లో Gemini యాప్ ఓపెన్ చేయాలి.

3. ప్రాంప్ట్ బార్‌లో video బటన్‌ను ట్యాప్ చేయాలి.

4. ఇది క‌నిపించ‌క‌పోతే మరిన్ని ఆప్షన్ల కోసం మూడు డాట్స్ ట్యాప్ చేయాలి.

5. ఉదాహరణకు: “సాయంత్రం సముద్రతీరంలో అలలు మెల్లగా కదులుతున్న దృశ్యం” వంటి టెక్స్ట్ ఇవ్వాలి.

6. మ్యూజిక్, డైలాగ్స్ వంటి అదనపు సూచనలతో ప్రాంప్ట్‌ను అందించ‌వ‌చ్చు.

7. ఆ త‌ర్వాత Generate బటన్‌ను ట్యాప్ చేస్తే, వియో 3 ఆ ప్రాంప్ట్ ఆధారంగా కంప్లీట్ వీడియోను రూపొందిస్తుంది.

66
గూగుల్ ఏఐ విడియో టూల్ వియో 3 ఫీచర్లు

Google DeepMind ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లి కాలిన్స్ తెలిపిన‌ ప్రకారం.. వియో 3 టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్‌ల నుంచి రియల్-వరల్డ్ ఫిజిక్స్, ఖచ్చితమైన లిప్ సింకింగ్ వరకు ప్రతి అంశంలో అద్భుతంగా పనిచేస్తుంది. వియో 3తో వాస్తవిక దృశ్యాలు, సమయానికి సరిపోయే డైలాగ్స్, అందమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ సహా మొత్తం వీడియో అనుభవం ఆధునికంగా ఉండబోతోందని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories