Vivo ఫోన్‌లు సాధారణంగా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫోన్ Android 13 OSతో వస్తుంది. వెనుక రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ రింగ్-ఆకారపు LED ఫ్లాష్ లైట్ ఉంది.
ముందు భాగంలో, మీరు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే Wi-Fi 6, బ్లూటూత్ 5.3కి సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఈ 5G ఫోన్ 4,600mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. Vivo 66W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్ అందిస్తుంది. iQOO Z7 Pro 128GB స్టోరేజ్ మోడల్‌ని రూ. 23,999 ప్రారంభ ధరతో ఇటీవల ఇండియాలో ప్రకటించారు.
కాబట్టి కొత్త Vivo ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ లేటెస్ట్ T-సిరీస్ ఫోన్‌ను ఎ ధరకు నిర్ణయిస్తుందో చూస్తే iQOO ఫోన్ కంటే తక్కువగా లేదా రూ. 23,999 కంటే పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది - 8GB RAM + 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM + 256GB స్టోరేజ్.
8GB + 128GB వేరియంట్ ధర రూ.23,999 ఇంకా 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.24,999. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 29 నుంచి దీని సాస్సేల్స్ ప్రారంభం కానున్నాయి.