Apple iPhone 15 కొత్త 48MP కెమెరా సిస్టమ్, USB-C పోర్ట్, కొత్త చిప్‌సెట్ ఇంకా ఇతర ఫీచర్లతో పరిచయం చేయబడింది. అయితే, దీని ధర గత సంవత్సరం లాంచ్ అయిన మోడల్ Apple iPhone 14 దగ్గరలో ఉంది. భారతదేశంలో 128GB స్టోరేజ్‌తో Apple iPhone 15 ధర రూ. 79,900, అయితే కసతమర్లు ఫస్ట్ డే సేల్ రోజున రూ.14000 వరకు తగ్గింపును పొందవచ్చు. Apple iPhone 15 Plus 256GB మోడల్ ధర రూ.89,900 అండ్ 512GB మోడల్ ధర రూ.1,09,900.
భారతదేశంలోని ఆపిల్ ప్రీమియం స్టోర్లు ఆపిల్ ఐఫోన్ 15ను ప్రీ-బుక్ చేసిన కస్టమర్లకు రూ.9000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తారు. అంతే కాకుండా, అర్హత కలిగిన HDFC బ్యాంక్ కార్డ్‌తో కస్టమర్‌లు Apple iPhone 15 అండ్ Apple iPhone 15 Plusపై రూ.5000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. HDFC బ్యాంక్ ఆఫర్ అఫీషియల్ Apple స్టోర్ ఇంకా Reliance Digital, Croma, Vijay Sales వంటి ఎలక్ట్రానిక్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.
Apple iPhone 15 A16 బయోనిక్ చిప్‌తో పాటు 6GB RAMతో పనిచేస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15లో ఉపయోగించిన ఏ16 బయోనిక్ చిప్ గత ఏడాది యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌తో పరిచయం చేసింది. ఫోన్ ముందు భాగంలో 6.1-అంగుళాల సూపర్ రెటినా XTR డిస్‌ప్లే ఉంది. Apple iPhone 15 A16 చిప్‌తో మంచి బ్యాటరీ లైఫ్ పొందుతుంది.
Apple iPhone 15 కెమెరా కొత్త జనరేషన్ Apple iPhoneలో అతిపెద్ద అప్ డేట్ . Apple iPhone 14 Pro లాగనే Apple iPhone 15 48MP ప్రైమరీ సెన్సార్ పొందుతుంది. 48MP కెమెరాకు 12MP సెకండరీ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది. మరో పెద్ద మార్పు ఈ ఫోన్ కింద అంచున USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు.