కోట్ల విలువైన లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ హాట్ బ్యూటీలు: వీటిలో ఎన్ని స్పెషాలిటీలు ఉన్నాయో తెలుసా..

First Published | Sep 19, 2023, 3:05 PM IST

తెలుగు  సినిమాలు, వెబ్ సిరీస్లతో ప్రజల్ని ఆకట్టుకుంటూ  అలరిస్తున్న  బాలీవుడ్ బ్యూటీ  తాప్సీ పన్ను ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. అది కూడా అలంటి ఇలాంటి మాములు కారు కాదు, లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు.. దీని ధర కోటి రూపాయలకి పై మాటే.. అదేవిధంగా ఈ కాస్ట్లి కారుని రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాజాగా అదే మోడల్ కారును సొంతం చేసుకుంది.
 

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మోజావే సిల్వర్ సింగిల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో  సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600ని ఇంటికి తీసుకువచ్చింది. దీని ధర ఎంతో తెలుసా..  రూ.2.92 కోట్లు (ఎక్స్ షోరూమ్).
 

ముంబైకి చెందిన మెర్సిడెస్-బెంజ్ ల్యాండ్‌మార్క్ కార్స్ కొత్త కారుతో తాప్సి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Swanky GLS 600  ఫోటోను బానెట్‌పై పెద్ద రెడ్ రిబ్బన్‌తో పోస్ట్ లో చూడవచ్చు. 
 

Latest Videos


తాప్సీ పన్ను మాత్రమే కాదు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో నటించిన రకుల్ ప్రీత్ కూడా ఇదే మోడల్ కారును కోట్లకు కొనుగోలు చేసింది. 
 

Mercedes-Maybach GLS 600 భారతదేశంలోని ఫ్లాగ్‌షిప్ SUV. కొనేవారి కస్టమైజేషన్ స్థాయిని బట్టి దీని ఆన్-రోడ్ ధర రూ. 4 కోట్లు ఉంటుంది. 
 

3.2-టన్నుల లగ్జరీ SUV  4.0-లీటర్ V8 ట్విన్-టర్బో ఇంజిన్‌ను పొందుతుంది. ఈ కారు 550 hp మాక్స్  పవర్,  730 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి   చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ లగ్జరీ SUV టాప్ స్పీడ్  250 kmph అండ్ 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.
 

మేబ్యాక్ బ్రాండ్ పేరు Mercedes-Benz, అందించే అత్యధిక స్థాయి సేఫ్టీ సూచిస్తుంది. ఫోర్ -జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్‌ సైడ్ స్టెప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, మసాజ్ సీట్లు, రియర్ సీట్ టాబ్లెట్, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, 22-అంగుళాల వీల్స్, MBUX సిస్టమ్‌తో డ్యూయల్. 12.3-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలు ఇంకా మరిన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
 

అదనపు ఫీచర్లలో ఇ-యాక్టివ్ బాడీ కంట్రోల్ యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఫోల్డింగ్ రియర్ టేబుల్స్, రియర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్, బర్మెస్టర్ 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, పవర్-అడ్జస్టబుల్ బ్యాక్ సీట్లు, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్‌మెంట్, షాంపైన్ ఫ్లూట్ హోల్డర్ మొదలైనవి ఉన్నాయి.
 

click me!