ట్విటర్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. దీన్ని ఉపయోగించడానికి ఇకపై యూజర్లు ప్రతినెలా ఎం చేయాలంటే..?

First Published | Sep 19, 2023, 11:58 AM IST

టెస్లా సీఈఓ, బిలియనీర్  ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో కొన్ని పెద్ద మార్పుల గురించి స్పందించారు, అయితే ట్విట్టర్‌ పేరును  Xగా మార్చిన సంగతి మీకు తెలిసందే. తాజాగా భవిష్యత్తులో Xని ఉపయోగించే ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించడానికి   ప్రతినెలా ఛార్జ్  చెల్లించవలసి ఉంటుందని సూచించాడు. 

 బాట్స్(bots) అని కూడా పిలువబడే ఫేక్ అకౌంట్స్ సమస్యను ఎదుర్కోవడమే ఈ చర్య వెనుక కారణం అని వెల్లడవుతుంది.

అయితే, CNBC నివేదిక ప్రకారం, ఈ ఛార్జ్  ఎంత ఉంటుందో లేదా చెల్లించినందుకు వినియోగదారులు ఎలాంటి బెనిఫిట్స్  పొందుతారో  పేర్కొనలేదు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన  సందర్భంగా ఎలోన్ మస్క్ X గురించిన కొన్ని  విషయాలను  వెల్లడించాడు. ఇప్పుడు Xకి 550 మిలియన్ల మంది యూజర్లు  ఉన్నారని, వారు ప్రతి నెలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారని ఇంకా ప్రతిరోజూ 100 నుండి 200 మిలియన్ల మధ్య పోస్ట్‌లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

Latest Videos


అయితే ఈ యూజర్లలో ఎంత మంది బాట్స్  కాకుండా నిజమైన అకౌంట్స్ ఉన్నాయి  అనే    విషయాన్నీ ఎలోన్ మస్క్  స్పష్టం చేయలేదు. అతను ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇప్పుడు  వీటికి  పై ఏ విధంగా  పోల్చలేదు.

నెతన్యాహుతో ఎలోన్ మస్క్  చాట్   ప్రాథమిక లక్ష్యం కృత్రిమ మేధస్సు వంటి లేటెస్ట్  టెక్నాలజీ   ప్రమాదాలను ఇంకా  దానిని ఎలా కంట్రోల్ చేయాలో అనే దాని గురించి చర్చించడం.  
 

అయితే ఈ యూజర్లలో ఎంత మంది బాట్స్  కాకుండా నిజమైన అకౌంట్స్ ఉన్నాయి  అనే    విషయాన్నీ ఎలోన్ మస్క్  స్పష్టం చేయలేదు. అతను ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇప్పుడు  వీటికి  పై ఏ విధంగా  పోల్చలేదు.

నెతన్యాహుతో ఎలోన్ మస్క్  చాట్   ప్రాథమిక లక్ష్యం కృత్రిమ మేధస్సు వంటి లేటెస్ట్  టెక్నాలజీ   ప్రమాదాలను ఇంకా  దానిని ఎలా కంట్రోల్ చేయాలో అనే దాని గురించి చర్చించడం.  

ఎలోన్ మస్క్  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో  వివిధ గ్రూప్స్ అండ్  వ్యక్తుల గురించి గతంలో నెగటివ్  కామెంట్స్ చేశాడు. ఏదేమైనప్పటికీ, నెతన్యాహుతో చర్చ సందర్భంగా, అతను ఏదైనా గ్రూప్ పై మాటల  దాడి చేయడం వ్యతిరేకమని పేర్కొన్నాడు ఇంకా  మానవత్వం, ఐక్యత  ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.

ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో గణనీయమైన మార్పులు చేశాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి గతంలో నిషేధించబడిన అకౌంట్స్ తిరిగి రావడానికి అతను అంగీకరించాడు. ప్రముఖ వ్యక్తుల అకౌంట్స్  గుర్తించే "బ్లూ టిక్" వెరిఫైడ్ సిస్టంను కూడా అతను తొలగించాడు.

ఇప్పుడు, మీరు డబ్బు  చెల్లిస్తే మీ పేరు పక్కన బ్లు టిక్  పొందుతారు ఇంకా మీ పోస్ట్‌లు ఎక్కువ మంది చేసేందుకు రీచ్ ని  పొందుతాయి. మీరు బ్లు టిక్ కోసం డబ్బు చెల్లించకపోతే, మీ పోస్ట్‌లు అంతగా దృష్టిని ఆకర్షించకపోవచ్చు. ఈ మార్పు X ప్లాట్‌ఫారమ్‌పై బాట్స్  వినియోగాన్ని నిరుత్సాహపరుస్తుందని ఎలోన్ మస్క్ అభిప్రాయపడ్డారు.

X యునైటెడ్ స్టేట్స్‌లో మనీ ట్రాన్స్‌మిటర్‌గా మారడానికి లైసెన్స్‌లను పొందేందుకు కూడా కృషి చేస్తోంది ఇంకా పబ్లిక్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అనుమతి పొందింది.

click me!