ఈ అంతరయం ఏర్పడిన కొద్దిసేపటికే మూడు ప్లాట్‌ఫారమ్‌లలో సమస్యని తొలగించినప్పటికి ఆ సమయంలో ప్రజలు మెసేజులు పంపడం లేదా టైమ్ లైన్ రిఫ్రెష్ చేయడంలో ఇబ్బందులు ఎదురుకొన్నారు. భారత్‌తో సహా అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీ, బ్రెజిల్, బంగ్లాదేశ్, యు.కె, యు.ఎస్ లోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారులు సమస్యలు ఎదురుకొన్నారని ఒక నివేదిక పేర్కొంది.
undefined
డౌన్‌డెక్టర్ ప్రకారం ఈ మూడు ప్లాట్‌ఫారమ్ బుధవారం రాత్రి 11:40 గంటలకు డౌన్ అయినట్లు నిర్ధారించింది. అయితే ఫోటోలను అప్‌లోడ్ చేయడంలో చాలా మంది ఇబ్బందులు ఎదురుకొన్నట్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ట్విట్టర్ వినియోగదారులు మీమ్స్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ని ట్రోల్స్ కూడా చేశారు.
undefined
ఈ అంతరాయంపై ఫేస్ బుక్ ప్రతినిధి డైలీ మెయిల్ తో మాట్లాడుతూ నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ వల్ల ప్రజలు ఫేస్‌బుక్‌ను యాక్సెస్ చేయడంలో సమస్య ఏర్పడిందని అయితే ఈ సమస్య చాలా తక్కువ సమయంలోనే పరిష్కరించినట్లు తెలిపారు.
undefined
ఈ సంవత్సరం మార్చిలో కూడా వాట్సాప్ సుమారు 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కూడా కొద్దిరోజుల క్రితం నిలిచిపోయాయి. సర్వర్ సమస్య కారణంగా ఈ సమస్య సంభవించినట్లు సంస్థ తెలిపింది.
undefined