ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ నిలిచిపోవడానికి అసలు కారణం ఇదేనా..?

First Published | Oct 5, 2021, 1:40 PM IST

సోమవారం రాత్రి  సోషల్ మీడియా వినియోగదారులకు ఊహించని సమస్య ఎదురైంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్, వాట్సప్ అకస్మాత్తుగా నిలిచిపోయాయి. మెసేజ్స్ రావడం లేదు పంపడం కూడా ఆగిపోయాయి. ఈ మూడు సోషల్ మీడియా సైట్లు సుమారు ఆరు గంటల పాటు అంతరాయం ఎదురుకొన్నాయి. 

అయితే మూడు సోషల్ మీడియా సైట్‌లు ఒకేసారి డౌన్ అవడానికి ఏం జరిగి ఉండొచ్చో తెలుసుకోవడానికి చాలా మంది  ప్రయత్నించారు. ఈ సామాజిక సైట్‌లు ఒకేసారి కూలిపోవడానికి అసలు కారణం తెరపైకి వచ్చింది. 

బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (బిజిపి)లో లోపం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్ అయిన వెంటనే  ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణులు అంతరాయాలకి కారణాలను గుర్తించడం ప్రారంభించారు. బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (బిజిపి) లో లోపం కారణంగా మూడు ఫేస్‌బుక్ యాప్‌లు డౌన్ అయ్యాయని సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్ చెప్పారు.  

Latest Videos


బి‌జి‌పి అంటే ఏమిటి

ఐ‌టి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వినియోగదారు ఇంటర్నెట్‌లోకి ప్రవేశించినప్పుడు బి‌జి‌పి అతడిని ప్రయాణించేలా చేస్తుంది. డేటా ప్రయాణించే మార్గాలను నిర్ణయిస్తుంది. పెద్ద రౌటర్లు  రూట్‌లను తరచుగా అప్‌డేట్ చేస్తుంటాయి, ఫేస్‌బుక్ షట్‌డౌన్‌కు కొన్ని నిమిషాల ముందు, బిజిపి మార్గంలో పెద్ద మార్పులు జరిగాయని సైబర్ నిపుణుడు చెప్పారు. 

డొమైన్ నేమ్ సిస్టమ్

డి‌ఎన్‌ఎస్  కూడా ఇంటర్నెట్‌లో చాలా ముఖ్యమైన భాగం. డి‌ఎన్‌ఎస్  వెబ్ డొమైన్‌ని ఇంటర్నెట్ ప్రోటోకాల్‌గా మారుస్తుంది. సోమవారం రాత్రి డొమైన్ పేరు లోపం కూడా ఉంది, దీంతో స్మార్ట్ ఫోన్‌లు లేదా సిస్టమ్‌లపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను నిలిచిపోవడానికి  దారితీసింది. 

ఫేస్‌బుక్ నుండి అధికారిక ప్రకటన

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నిపుణులు వారి పరిశోధనల ఆధారంగా మూడు సామాజిక సైట్‌లు ఆగిపోవడానికి కారణాలు ఇస్తున్నారు. అయితే ఇంతవరకు ఫేస్ బుక్ ఆగిపోవడానికి గల కారణానికి సంబంధించి ఫేస్‌బుక్ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు.

click me!