ఆండ్రాయిడ్ USB ఛార్జర్ ఉపయోగించి ఐఫోన్ 15 ఛార్జ్ చేయవచ్చా..? మీ ప్రశ్నలకి సమాధానం ఇదిగో..

First Published | Sep 29, 2023, 11:24 AM IST

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, చాలా మంది కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనేందుకు ఇష్టపడుతున్నారు. భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉండడంతో అమెరికా, దుబాయ్‌ లేదా ఇతర దేశాలలోని బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను  నుండీ పొనుగోలు చేస్తున్నారు. 

అలాగే,  ఈసారి Apple iPhone 15 సిరీస్‌ను USB type C ఛార్జింగ్ పోర్ట్‌తో తీసుకొచ్చింది. దింతో చాలా మంది ఈ ఫోన్ ఛార్జర్‌ను కొనుగోలు చేయాలా లేదా Android ఛార్జర్‌ను ఉపయోగించాలా అనే ఆలోచనలో ఉన్నారు.

Apple iPhone 15 సిరీస్‌ను USB C ఛార్జింగ్ పోర్ట్‌తో ప్రారంభించినప్పటి నుండి, మీరు ఇప్పటికే ఉన్న USB C కేబుల్‌ని ఉపయోగించి కొత్త ఐఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చా అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలాగే, ఐఫోన్ 15ను ఛార్జ్ చేయడానికి ఆండ్రాయిడ్ USB C కేబుల్‌ను ఉపయోగించడం ద్వారా ఫోన్  పాడవుతుందని పేర్కొంటూ కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి.
 

Latest Videos


కానీ ఈ USB-C కేబుల్స్ అన్నీ కొత్త iPhone 15 సిరీస్ మోడల్‌లతో సహా ఏ  డివైజ్ నైన  ఛార్జ్ చేయగలవు. టెక్నాలజీ  వేరుగా  ఉన్నప్పటికీ, ఇతర కేబుల్‌లు కంపాటబుల్  కాదన  అర్థం కాదు. ఐప్యాడ్ ఎయిర్/ఐప్యాడ్ ప్రో ఇంకా మ్యాక్‌బుక్ USB-C కేబుల్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు  అయితే ఈ కేబుల్‌ iPhone 15 మోడల్‌లను ఛార్జ్ చేయడానికి సమస్య కాదు. కాబట్టి, మీ iPhone 15ని ఇతర USB-C కేబుల్స్‌తో  ఛార్జింగ్ చేయడంలో కూడా ఎలాంటి సమస్య ఉండదు. 

Apple గతంలో ఫ్లాష్ కేబుల్‌ కంపాటబిలిటీని iPhone (MFi) ద్వారా సర్టిఫైడ్  వాటికి లిమిట్  చేయడం చూశాము. అదేవిధంగా, USB-C పోర్ట్ కోసం Apple ఇదే విధమైన వ్యూహాన్ని ఉందని ప్రజలు భావించకూడదు. ఎందుకంటే ఆపిల్ USB-C పోర్ట్‌కి మారడం  మొత్తం విషయం  ఏమిటంటే, ప్రజలు ప్రస్తుత Android USB-C ఛార్జింగ్ కేబుల్‌ని ఉపయోగించడానికి సహాయపడుతుంది. 

 అలాగే, USB-Cకి  మరీన  తర్వాత కూడా iPhone 15 సిరీస్ ఛార్జింగ్ స్పీడ్ మారలేదు. మీరు 27W వైర్డు ఛార్జింగ్ స్పీడ్‌  పొందుతారు.   అయితే, ఆండ్రాయిడ్ ఫోన్   USB కేబుల్ ఉపయోగించడం ఐఫోన్ ఛార్జింగ్ స్పీడ్ ని మార్చదు.
 

click me!