3330 కోట్లు, రోజుకు 111 మాత్రలు.. మరణం లేకుండా ఎప్పటికి యవ్వనంగా ఉండేందుకు 3 ఏళ్ల క్రితమే..

First Published | Sep 28, 2023, 2:47 PM IST

చాలా మంది లక్షాధికారులు, కోరిశ్వారుల లైఫ్ స్టయిల్ అందరికంటే భిన్నంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరింత ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉంటారు. అందుకే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. 

ఇందుకోసం ఫిట్‌నెస్‌, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా ఖర్చుచేసేందుకు రెడీగా ఉంటారు కూడా. అలాగే బ్రయాన్ జాన్సన్ అనే వ్యక్తి  ఎప్పటికి  బ్రతికి ఉండేందుకు రోజుకు 111 మాత్రలు తీసుకుంటున్నాడు. కష్టంగా అనిపించినా ఇది నిజం. 

బ్రియాన్ జాన్సన్ USD 400 మిలియన్లకు పైగా సంపద ఉన్న వ్యవస్థాపకుడు అండ్ టెక్ మిలియనీర్. భారత కరెన్సీలో దాదాపు రూ.3330 కోట్లు. అందుకే మరణం లేకుండా ఎప్పటికీ ఎలా జీవించాలనే ప్లాన్‌తో డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.


మరణాన్ని అరికట్టేందుకు రోజూ 111 మాత్రలు వేసుకునే 46 ఏళ్ల బిలియనీర్ బ్రియాన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఐడియాస్ అండ్ వ్యవస్థాపకత ద్వారా  అదృష్టాన్ని పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు అతను తన సంస్థ 'బ్లూప్రింట్' ద్వారా హోమో సేపియన్స్‌కు అత్యంత ముఖ్యమైన రివొల్యూషన్  అని నమ్ముతున్న టెక్నాలజీని రూపొందించే దిశగా కృషి చేస్తున్నాడు. బ్రియాన్ జాన్సన్  మరణం లేకుండా ఇంకా  ఎప్పటికీ యవ్వనంగా ఉండటానికి అనేక పద్ధతులను  మూడు సంవత్సరాల క్రితమే  ప్రారంభించాడు. 

ఈ సందర్భంగా బ్లూప్రింట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఎప్పటికీ జీవించాలనే అతని కల కోసం ప్రతిరోజూ 111 మాత్రలు తీసుకోవడం ఇంకా ప్రతిరోజూ మల నమూనాలను సేకరించడం అలాగే పరీక్షించడం ఉన్నాయి. 

ప్రతిరోజూ, బ్రియాన్ జాన్సన్ వందల కొద్దీ టాబ్లెట్స్ తీసుకుంటాడు. మినీ జెట్ ప్యాక్‌  ప్రతిరోజూ అతని రాత్రిపూట అంగస్తంభనను పర్యవేక్షిస్తుంది. ఇందుకు రెడ్ లైట్ కాంతిని ప్రసరింపజేసే ప్రత్యేక క్యాప్  తలపై ధరిస్తారు. ఈ కోటీశ్వరుడు తన బ్లూప్రింట్‌ ప్రాజెక్టులో  రూ.33 కోట్ల పెట్టుబడి పెట్టాడు. అతనిని ఎప్పటికీ జీవించేలా చేయడమే దీని లక్ష్యం.

కంపెనీ ప్రకారం, బ్లూప్రింట్ ఇప్పటికే  ఈ 46 ఏళ్ల బిలియనీర్ వ్యక్తికి 37 ఏళ్ల వ్యక్తి నుండి గుండె ఇంకా 30 ఏళ్ల వ్యక్తి నుండి అవయవాలు అండ్ ఎముకలను అందించింది. బ్రియాన్  అంతిమ లక్ష్యం కఠినమైన డైట్, దినచర్య ద్వారా తనను తాను 18 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా మార్చుకోవడం.

బ్రియాన్ ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు మేల్కొంటాడు,  11 గంటలకు ముందే భోజనం చేస్తాడు. రాత్రి 8:30 గంటలకు పడుకుంటారు. అతను రోజంతా తన శరీరాన్ని LED లైట్‌లో ఉంచుతాడు. అతని జీవితం  అంతిమ లక్ష్యం 'చావకుండా' ఇంకా యువకుడిగా  మారడం.

Latest Videos

click me!