మీ ఫోన్ నెంబర్ తో పనిలేకుండా రీచార్జ్ చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా..?

Published : Mar 10, 2026, 07:13 PM IST

రీఛార్జ్ షాపుల్లో మీ మొబైల్ నంబర్ ఇచ్చేందుకు భయపడుతున్నారా..? ముఖ్యంగా మహిళలు ఇలా బయట రీచార్జ్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతుంటారు. వీరికోసం బిఎస్ఎన్ఎల్ సరికొత్త పరిష్కారం తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

PREV
16
బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్

BSNL Kavach : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటి దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోంది ఈ ప్రభుత్వ సంస్థ. టెక్నాలజీ విషయంలో, మెరుగైన సేవలు అందించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. అందుకే బిఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. తాజాగా మహిళా కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన సర్వీస్ తీసుకువచ్చింది. అదే బిఎస్ఎన్ఎల్ కవచ్.

26
ఏమిటీ బిఎస్ఎన్ఎల్ కవచ్..?

రీఛార్జ్ షాపుల్లో ముక్కూమొఖం తెలియనివారికి తమ ఫోన్ నంబర్ చెప్పడానికి మహిళలు చాలా ఇబ్బందిగా ఉంటుంది... కానీ రీచార్జ్ చేసుకోవాలంటే తప్పదు. తమ నంబర్ తప్పుడు వ్యక్తుల చేతికి వెళ్లి వేధింపులకు దారితీసే ప్రమాదం ఉందనేది మహిళల భయం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ఫీచర్ తెచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా 'కవచ్ నంబర్'ను ప్రారంభించింది.

36
BSNL కవచ్ ఎలా పనిచేస్తుంది..?

పేరుకు తగ్గట్టే ఇది మహిళల అసలు మొబైల్ నంబర్‌కు ఒక 'కవచం'లా పనిచేస్తుంది. ఈ సర్వీస్‌లో యూజర్ అసలు మొబైల్ నంబర్‌కు లింక్ అయిన 10 అంకెల తాత్కాలిక నంబర్‌ను BSNL ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తుంది. మహిళలు షాపుల్లో రీఛార్జ్ చేసేటప్పుడు తమ అసలు నంబర్‌కు బదులుగా ఈ తాత్కాలిక కవచ్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. దీంతో రీఛార్జ్ పూర్తవుతుంది, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది.

46
మహిళల భద్రత కోసం సూపర్ ఫీచర్...

ఈ కవచ్ నంబర్ అసలు ఫోన్ నంబర్‌కు, రీఛార్జ్ చేసే షాపు యజమానికి మధ్య ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల మహిళల అసలు మొబైల్ నంబర్లు ఏ రీఛార్జ్ షాపు డేటాబేస్‌లోనూ సేవ్ కాకుండా ఈ ఫీచర్ చూసుకుంటుంది. తరచుగా షాపులకు వెళ్లి రీఛార్జ్ చేసుకునే మహిళలకు ఇది ఒక వరం లాంటిది. ఇకపై ఎలాంటి భయం లేకుండా వారు షాపులకు వెళ్లొచ్చు.

56
బిఎస్ఎన్ఎల్ కవచ్ నంబర్ ఎలా పొందాలి..?

బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోనే 'BSNL Self Care' యాప్ ద్వారా ఈ కవచ్ నంబర్‌ను చాలా సులభంగా పొందవచ్చు. ఈ సేవ గురించి మరిన్ని వివరాలను BSNL అధికారిక వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. మహిళల డిజిటల్ భద్రత విషయంలో బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు.

66
BSNL 5G క్వాంటం సేవలు..

ఇదిలావుంటే ఇటీవల బిఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీతో క్వాంటం 5G సేవలను ప్రారంభించింది. హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు... ఎలాంటి సిమ్ కార్డు, వైర్లు లేకుండానే అత్యధిక వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. త్వరలోనే ఈ సేవలను డిల్లీ, ముంబై వంటి నగరాల్లోనూ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు బిఎస్ఎన్ఎల్ చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories