Data Plans : కేవలం రూ.39కే రోజుకు 3GB డేటా.. జియో చౌక ప్లాన్స్ గురించి మీకు తెలుసా?

Published : Mar 09, 2026, 08:02 PM IST

రిలయన్స్ జియో కేవలం రూ.80 లోపు ధరలో కూడా కొన్ని రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం…

PREV
15
జియో రీఛార్జ్ ప్లాన్..

ఇంటర్నెట్ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ డేటా ఇచ్చే రీఛార్జ్ ప్లాన్‌ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో రూ.80 లోపు కొన్ని సులభమైన డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా రోజూ ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారికి ఈ ప్లాన్స్ చాలా ఉపయోగపడతాయి.

25
రూ.39 రీచార్జ్ ప్లాన్..

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది రూ.39 డేటా ప్లాన్. ఈ ప్లాన్‌తో యూజర్లకు రోజూ 3జీబీ డేటా లభిస్తుంది… ఇలా మూడు రోజులపాటు 9 జిబి డేటీ వాడుకోవచ్చు., తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇదే విధంగా, కొన్ని ప్లాన్స్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

35
జియో చౌకైన డేటా ప్యాక్

జియో అందిస్తున్న రూ.19 డేటా ప్లాన్ చాలా తక్కువ ధర కలిగిన యాడ్-ఆన్ ప్లాన్. దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. ఆ ఒక్క రోజులో యూజర్లు 1జీబీ ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. తక్కువ సమయానికి డేటా అవసరమైన వారికి ఇది అనుకూలమైన ఎంపిక. ఇక కేవలం 1 గంట వ్యాలిడిటీతో 10 జిబి డేటా ప్లాన్ కూడా ఉంది… ఇందుకోసం రూ.11 తో రీచార్జ్ చేసుకోవాలి. 

45
జియో డేటా ప్యాక్

ఇంకా రూ.29 డేటా ప్లాన్ రెండు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 2జీబీ ఇంటర్నెట్ డేటా ఇస్తున్నారు. అలాగే రూ.49 డేటా ప్లాన్ ఒక్క రోజు వ్యాలిడిటీతో వస్తుంది. దీనితో యూజర్లు ఏకంగా 25జీబీ డేటా పొందుతారు. ఎక్కువ స్పీడ్‌తో డేటా వాడాల్సిన వారికి ఇది బెస్ట్ ప్లాన్‌గా చెప్పొచ్చు.

55
జియో డేటా రీఛార్జ్

వీటితో పాటు రూ.69 డేటా ప్లాన్‌కు ఏడు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది, ఇందులో మొత్తం 6జీబీ డేటా లభిస్తుంది. అదే సమయంలో, రూ.77 డేటా ప్లాన్ ఐదు రోజుల వ్యాలిడిటీతో పాటు రోజూ 3జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అదనంగా Sony Liv ఓటీటీ సేవకు యాక్సెస్ కూడా లభిస్తుంది. దీంతో తక్కువ ధరలో ఎక్కువ డేటా కోరుకునేవారికి ఈ జియో ప్లాన్స్ మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories