తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి, కొత్త కస్టమర్లను పెంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్ కంపెనీ కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతోంది. హోలీ పండుగ సందర్భంగా అయితే అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. ఎక్కువమంది వాడే రీఛార్జ్ ప్లాన్ మీద నెల వ్యాలిడిటీ ఫ్రీగా ఇస్తోంది. మీరూ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులైతే త్వరపడండి మరి.
ఇండియాలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఉన్నా, ఈమధ్య కాలంలో బీఎస్ఎన్ఎల్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఈ టెలికామ్ కంపెనీలను అత్యధికంగా ఆకట్టుకుంటోంది.
24
బీఎస్ఎన్ఎల్ హోలీ ఆఫర్
ఇండియాలో హోలీ పండుగ దగ్గర పడుతుండటంతో బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 రీఛార్జ్‌తో 30 రోజులు ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, ఢిల్లీ, ముంబైలో ఉచిత రోమింగ్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ ఉన్నాయి.
34
బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్
మీకు రోజుకు 2జీబీ డేటా చొప్పున మొత్తం 850 జీబీ డేటా లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులందరికీ బీఐటీవీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. దీని ద్వారా 350 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్స్, వివిధ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా చూడవచ్చు. రూ.2,399 ధరలో ఇలాంటి ఆఫర్ ఉన్న ప్లాన్‌ను జియో, ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియాలలో ఊహించలేము.
44
బీఎస్ఎన్ఎల్ 4జీ
బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తోంది. ఈ ఏడాది మొదటి భాగంలో 100,000 కొత్త 4జీ టవర్లు ఏర్పాటు చేయనుంది.