BSNL చాలా తక్కువ ధరకే 90 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌లకు సమస్యగా మారే అవకాశం ఉంది. ధరలు పెంచిన తర్వాత జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ కంపెనీలు చాలా మంది కస్టమర్లను కోల్పోతున్నాయి. ఈ కస్టమర్లంతా BSNL వైపు మొగ్గు చూపుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే BSNL తక్కువ ధరకే 365 రోజుల ప్లాన్‌ను ప్రకటించింది. ఇప్పుడు తక్కువ ధరకే 90 రోజుల ప్లాన్‌ను ప్రకటించింది. ఈ 90 రోజుల ప్లాన్ ధర, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.