మొన్నటి వరకు విడివిడిగా ఉన్న జియో, డిస్నీ + హాట్‌స్టార్ కలిసి జియో హాట్‌స్టార్ అనే కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులకు అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయి. కానీ ఈ విలీనం క్రికెట్ అభిమానులకు మాత్రం బ్యాడ్ లక్ అని చెప్పారు.
మొన్నటి వరకు జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ క్రికెట్‌ను ఉచితంగా చూసిన వారు ఇకపై జియో హాట్ స్టార్‌లో ఐపీఎల్ చూడాలంటే ప్రత్యేకంగా చందా చెల్లించాలి. జియో ప్యాకేజీలను సైతం ప్రకటించింది. యాడ్స్‌తో కంటెంట్ వీక్షించాలనుకుంటే రూ. 149 ప్లాన్, యాడ్స్ లేకుండా అయితే రూ. 299 ప్లాన్ వివరాలను ప్రకటించింది.