యువతను ఆకట్టుకోవడానికి కంపెనీలు వివిధ రకాల గ్యాడ్జెట్లను విపణిలోకి తీసుకొస్తున్నాయి. అదే ఉద్దేశంతో లావా ప్రోవాచ్ బ్రాండ్ ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ విడుదల చేసింది. అధునాతన ఆరోగ్య, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో ఇది రూ. 4,499 ధరకు లభిస్తుంది. 1.43-అంగుళాల AMOLED స్క్రీన్, వివిధ సెన్సార్‌లు మరియు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు.
టెక్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లావా ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ ను రూపొందించింది. రూ. 4,499 ధరకు నావిగేషన్, హెల్త్ మానిటరింగ్ తదితర ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
23
ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ ఫీచర్లు
1.43-అంగుళాల AMOLED స్క్రీన్, Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్, బాడీ ఎనర్జీ మానిటరింగ్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) మానిటరింగ్, VO₂ Max అసెస్‌మెంట్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచీ సొంతం.
33
ప్రోవాచ్ X ఫిట్‌నెస్ ట్రాకింగ్
సిక్స్-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, ఆల్టీమీటర్, HX3960 PPG సెన్సర్ వంటివి ఉన్నాయి. VO2 Max, HRV, బాడీ ఎనర్జీ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది. వీటితో మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు. 300mAh బ్యాటరీ 10 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది.